మొబిస్టార్‌.. భారత్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌

23 May, 2018 15:02 IST|Sakshi
మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ స్మార్ట్‌ఫోన్‌

మన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను ముంచేత్తేందుకు మరో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండు వచ్చేసింది. ఇప్పటికే చైనా కంపెనీల ఫోన్లు భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో హోరెత్తిస్తుండగా.. తాజాగా వియత్నాంకు చెందిన మొబిస్టార్‌ కూడా దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది.  భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర 7,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. మే 30 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏడాది వారెంటీని కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన ఆకర్షణ ముందు వైపు డ్యూయల్‌ కెమెరా. 13 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, 5 మెగాపిక్సెల్‌ సెన్సార్లను ఆ స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంది. సెల్ఫీలకు ఇది 120 డిగ్రీల వైండ్‌ యాంగిల్‌ను కూడా సపోర్టు చేస్తోంది. షావోమి రెడ్‌మి వై1, ఒప్పో రియల్‌మి 1, హానర్‌ 7సీ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీగా మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ భారత మార్కెట్‌లోకి వచ్చింది.

మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ స్పెషిఫికేషన్లు...
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 7.1.2
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
వెనుక వైపు 13 మెగాపిక్సెల్‌ సెన్సార్‌
గ్రాఫిక్స్‌ కోసం అడ్రినో 505
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
డ్యూయల్‌ సిమ్‌, 160 గ్రాముల బరువు

మరిన్ని వార్తలు