మొబైల్ ఫోన్ల ద్వారా జోరుగా ట్రేడింగ్

10 Feb, 2015 02:32 IST|Sakshi
మొబైల్ ఫోన్ల ద్వారా జోరుగా ట్రేడింగ్

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల ద్వారా ట్రేడింగ్ జోరుగా పెరుగుతోందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. మొబైల్ ఫోన్ల ద్వారా స్టాక్ మార్కెట్ లావాదేవీలు గత ఏడాది మూడురెట్లు పెరిగాయని పేర్కొంది. టెక్నాలజీ వినియోగం వృద్ధి చెందుతోందనడానికి ఇది నిదర్శనమని వివరించింది. ఎన్‌ఎస్‌ఈ వెల్లడించిన గణాంకాల ప్రకారం.,,
- మొబైల్ ద్వారా 2014లో రోజుకు సగటున రూ.156 కోట్ల టర్నోవర్ జరిగింది. అంతకు ముందటి ఏడాదితో పోల్చితే ఇది 64 శాతం అధికం.
- ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ లావాదేవీలు 52 శాతం పెరిగాయి. 2013లో రూ.1,206 కోట్లుగా ఉన్న రోజువారీ సగటు టర్నోవర్ 2014లో 52 శాతం వృద్ధితో రూ.1,836 కోట్లకు పెరిగింది.
- స్టాక్ మార్కెట్ లావాదేవీలు -ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే వారి సంఖ్య 17 శాతం, మొబైల్స్ ద్వారా నిర్వహించే వారి సంఖ్య 101 శాతం చొప్పున పెరిగాయి.

మరిన్ని వార్తలు