త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌తో మొబైల్‌ ఫోన్లు

6 Oct, 2017 02:40 IST|Sakshi

పీజీఎం రాంచంద్రం వెల్లడి  
సాక్షి, హైదరాబాద్‌: త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్‌(సిమ్‌) కనెక్షన్‌తో కూడిన మైక్రోమ్యాక్స్, లావా ఫోన్లు అందు బాటులో రానున్నట్లు హైదరాబాద్‌ టెలికం ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ రాంచంద్రం వెల్లడించారు. గురువారం బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లో ఆయన విలేక రులతో  మాట్లాడారు. ఇప్పటికే రెండు సంస్థలతో ఒప్పందం కుదిరినప్ప టికీ ధర ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. వైఫై సేవలు మరింత విస్తరించేందుకు 118 గ్రామీణ వైఫై ఎక్సే్చంజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 4జీ సేవలను అందు బాటులో తెచ్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

2018, ఫిబ్రవరి 6వ తేదీ లోగా మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరిగా చేయిం చాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉచిత కాల్స్, డేటా రోమింగ్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాన్‌–429కు లభిస్తున్న ఆదరణతో రోజుకు మూడు వేలకు పైగా కొత్త కనెక్షన్లు వస్తున్నా యని ఆయన  పేర్కొ న్నారు. 180 రోజుల కాలపరిమితి గల ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌ లిమిటెడ్‌ కాల్స్, ప్రతిరోజు ఒక జీబీ  డేటా, 90 రోజుల అనంతరం ప్రతి 1 జీబీకి మూడు పైసలు చార్జీలు ఉంటాయని వివరిం చారు. ప్లాన్‌ 666లో 90 రోజుల కాలపరిమితి, అన్ని నెట్‌వర్క్‌లకు 2 జీబీ డాటా, 90 రోజులు దాటిన తర్వాత ప్రతి 2 జీబీకి మూడు పైసల చార్జీలు ఉంటాయని ఆయన చెప్పారు. విజయ, లక్ష్మి టాపప్‌ ఆఫర్‌పై 50 శాతం అదనంగా టాక్‌టైమ్‌ వర్తిస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో టెలికం అధికారులు సత్యానందం, హనుమంతరావు, శ్రీనివాస్, రవిచంద్ర, సుజాత, శేషాచలం, రాజహంస తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు