సెల్‌ఫోన్లపై జీఎస్టీ ఇకపై 18%

15 Mar, 2020 04:40 IST|Sakshi

6 శాతం పెంపు

జీఎస్టీ నెట్‌వర్క్‌ డిజైన్‌ మార్పు బాధ్యత ఇన్ఫోసిస్‌కు

ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్లపై జీఎస్టీని 18 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయించింది. ఇది ఏప్రిల్‌ 1నుంచి అమలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఇక్కడ జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఈ మేరకు అంగీకరించింది. వినియోగదారుల సమస్యలను అధిగమించేలా జీఎస్టీ నెట్‌వర్క్‌ డిజైన్‌ మెరుగుపరచాలని ఈ సమావేశం ఇన్ఫోసిస్‌ను కోరింది.

► పూర్తి స్థాయిలో జీఎస్టీ నెట్‌వర్క్‌ సామర్ధ్యం పెంపు, నిపుణులైన సిబ్బంది నియామకం, సమస్యలకు సులభ పరిష్కారాలు చూపడం వంటివి ఈ ఏడాది జూలై కల్లా పూర్తి కావాలి. కొత్త వ్యవస్థ 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది.
► మొబైల్‌ ఫోన్లు, కొన్ని కీలక విడిభాగాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచింది.
► విమానాల మెయింటెనెన్స్‌ అండ్‌ రిపైర్, ఓవర్‌హౌల్‌(ఎంఆర్‌వో)సేవలపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఎంఆర్‌వో సేవలు దేశంలోనే ప్రారంభం కావడానికి అవకాశం ఏర్పడుతుంది.
► ఈ–వాయిస్, క్యూఆర్‌ కోడ్‌ అక్టోబర్‌ ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
► ఎగుమతిదారులకు ఈ–వాలెట్‌ స్కీం నమోదు గడువును 2021 మార్చి 31కి పొడిగించింది.
► ఆలస్యమైన జీఎస్టీ చెల్లింపులపై వడ్డీని జూలై 2017 నుంచి అమలయ్యేలా చట్టాన్ని సవరణకు నిర్ణయం.
► మార్చి 14 వరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు రద్దయిన వారు కావాలనుకుంటే తిరిగి జూన్‌ 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
► 2018–19 సంవత్సరంలో రూ.5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి వ్యాపార సంస్థలకు జీఎస్‌టీఆర్‌–9సీ దాఖలు చేయనవసరం లేకుండా మినహాయింపు నిచ్చింది.
► జీఎస్టీ కింద రిజిస్టరయిన ప్రతి వ్యక్తి తన వ్యాపారానికి అనుగుణంగా సరఫరాదారుల ప్రాథమిక సమాచారం తెలుసునేందుకు వీలుగా త్వరలో ‘నో యువర్‌ సప్లయర్‌’ పేరుతో కొత్త సౌకర్యం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా