మొబైల్స్‌ రిటైల్‌లోకి ‘హ్యాపీ’

13 Mar, 2018 01:34 IST|Sakshi

అనంతపూర్‌లో తొలి స్టోర్‌ ప్రారంభం

ఏడాదిలో 200 ఔట్‌లెట్లు తెరుస్తాం

హ్యాపీ మొబైల్స్‌ ఎండీ కృష్ణ పవన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ విక్రయంలోకి సరికొత్త బ్రాండ్‌ ‘హ్యాపీ’ రంగ ప్రవేశం చేసింది. తొలి స్టోర్‌ను అనంతపూర్‌లో నటి సమంత అక్కినేని చేతుల మీదుగా సోమవారం ప్రారంభించింది. తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో స్టోర్లను విస్తరిస్తామని హ్యాపీ మొబైల్స్‌ ఎండీ కృష్ణ పవన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ‘కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములు, ఈ రంగంతో ముడిపడి ఉన్న అందరూ సంతోషంగా ఉండాలన్న ప్రధాన విలువతో హ్యాపీ బ్రాండ్‌ కొనసాగుతుంది.

తొలి ఏడాదే 150–200 ఔట్‌లెట్లను తెరవాలన్నది మా ప్రణాళిక. మొదటి సంవత్సరం రూ.500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకున్నాం. 1,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ప్రతి స్టోర్‌లో లైవ్‌ డెమో జోన్స్‌ ఏర్పాటు చేస్తాం. కస్టమర్‌కు వినూత్న అనుభూతి కల్పించేందుకు వర్చువల్‌ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. అంతర్జాతీయ బ్రాండ్లతో 200ల దాకా మోడళ్ల డిస్‌ప్లే ఉంటుంది.

వినియోగదార్ల కోసం బెస్ట్‌ డీల్స్‌ ఆఫర్‌ చేస్తున్నాం’ అని వివరించారు. టాప్‌ కంపెనీల యాక్సెసరీస్‌కు ప్రత్యేక ఏర్పాటు ఉంటుందని కంపెనీ ఈడీ కె.సంతోష్‌ తెలిపారు. రిపేర్‌ వస్తే స్టాండ్‌ బై ఫోన్‌ను కస్టమర్‌కు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

మరిన్ని వార్తలు