కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు ప్రభుత్వం నోటీసులు

23 Mar, 2018 19:57 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన కేంబ్రిడ్జ్ అనలిటికాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఫేస్‌బుక్‌ డేటాబేస్‌ను కొల్లగొట్టి ఏఏ సంస్థలు భారతీయుల డేటాను వాడుకున్నాయో తెలుపాలంటూ ఆదేశించింది. మొత్తం ఆరు ప్రశ్నలను సంధిస్తూ.. మార్చి 31 వరకు వీటిపై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఈ నోటీసులు జారీచేసింది. ఒకవేళ వీటిపై స్పందించపోతే, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.  

  • పైన పేర్కొన్న దొంగతనానికి పాల్పడి భారతీయుల డేటాను ఏమైనా అసైన్‌మెంట్‌కు వాడారా?
  • పైన పేర్కొన్న దానిలో ఎవరెవరున్నారు?
  • అసలు డేటాను వారు ఎలా పొందారు?
  • వ్యక్తుల అనుమతి తీసుకున్నారా?
  • అలా సేకరించిన డేటాను ఎలా వాడారు?
  • అటువంటి డేటా ఆధారంగా ఏదైనా ప్రొఫైలింగ్ చేయబడిందా?

వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయొద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అతేకాక మీ లొకేషన్‌ను కూడా వెల్లడించవద్దని సీఈఆర్‌టీ అడ్వయిజరీ జారీచేసింది. ఈ సూచనలు...ఫేస్‌బుక్‌ అనేది పబ్లిక్‌ నెట్‌వర్క్‌లో భాగం. తేలికగా ఈ సమాచారాన్ని యాక్సస్‌ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌, అన్ని సోషల్‌ మీడియా యూజర్లు తమ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఈ సైట్లలో లేదా యాప్స్‌లో షేర్‌ చేసుకోకూడదు. అధికారిక డేటాను లేదా వ్యక్తిగత సీక్రెట్లను పంచుకోకూడదు. ఓటు ప్రిఫరెన్స్‌లను, పిన్‌, పాస్‌వర్డ్‌లను, క్రెడిట్‌ కార్డు వివరాలను, బ్యాంకింగ్‌ వివరాలను, పాస్‌పోర్టు వివరాలను, ఆధార్‌ కార్డు వివరాలను ఈ సైట్లలో పొందపరచుకూడదు. అనధికారిక వర్గాల నుంచి వచ్చిన మెసేజ్‌లను, ఇమేజ్‌లను ఓపెన్‌ చేయకూడదు. థర్డ్‌ పార్టీ యాప్స్‌కు సమాచారం ఇచ్చే ముందుకు జాగ్రత్త వహించాలి. ఎంతో పకడ్భందీతో పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి. దానిలో సింబల్స్‌, క్యాపిటల్‌ లెటర్లు, లోయర్‌-కేసు లెటర్లు ఉండాలి. 
 

మరిన్ని వార్తలు