ఎంఓఐఎల్‌ వాటా విక్రయం... హిట్‌

26 Jan, 2017 01:09 IST|Sakshi
ఎంఓఐఎల్‌ వాటా విక్రయం... హిట్‌

కేంద్ర ఖజానాకు రూ.480 కోట్లు
న్యూఢిల్లీ: ఎంఓఐఎల్‌ వాటా విక్రయానికి రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో  రిటైల్‌ ఇన్వెస్టర్లకు 26.63 లక్షల షేర్లు కేటాయించగా, 1.42 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. వీరికి  కేటాయించిన వాటా 5.3 రెట్లు సబ్‌స్క్రైబయ్యింది.  వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.480 కోట్లు లభిస్తాయి. ఎంఓఐఎల్‌లో 10 శాతం వాటా(1.33 కోట్ల షేర్ల)ను రూ.365 ఫ్లోర్‌ ధరకు ప్రభుత్వం ఆఫర్‌ చేసింది. మంగళవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.51 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యింది.

ఇతర కంపెనీల ఆఫర్‌ ఫర్‌సేల్‌తో పోల్చితే ఎంఓఐఎల్‌కు మంచి స్పందన లభించిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆనందం  వ్యక్తం చేశారు. ఈ వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎంఓఐఎల్‌ షేర్‌ 1 శాతం లాభపడి రూ.372 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం  ఎంఓఐఎల్‌ షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ.794 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓఎఫ్‌ఎస్‌ విధానంలో వాటా విక్రయంచిన నాలుగో సంస్థ ఎంఓఐఎల్‌. ఇంతకు ముందు ఎన్‌బీసీసీ,  హిందుస్తాన్‌ కాపర్, ఎన్‌హెచ్‌పీసీల్లో వాటాలను విక్రయించింది.

మరిన్ని వార్తలు