వాహన విక్రయాలు.. క్రాష్‌!

10 Sep, 2019 05:23 IST|Sakshi

ఆగస్టులో అన్ని విభాగాల్లోనూ క్షీణతే

1997–98 తరువాత అత్యంత తక్కువ సేల్స్‌

న్యూఢిల్లీ: ఆటో రంగంలో మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో దేశీ వాహన అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సియామ్‌ 1997–98 నుంచి ఆటో అమ్మకాల డేటాను రికార్డు చేస్తుండగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయి పతనం నమోదుకాలేదు. ఆగస్టులో ప్యాసింజర్‌ వాహనాలు (పీవీ), వాణిజ్య వాహనాలు (సీవీ), ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు 23.55% తగ్గాయి. గతనెల విక్రయాలు 18,21,490 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన మొత్తం వాహనాలు 23,82,436 యూనిట్లు.  

10వ నెల్లోనూ పీవీ సేల్స్‌ డౌన్‌..: ఆగస్టులో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు ఏకంగా 31.57 శాతం క్షీణతను నమోదుచేశాయి. గతనెల అమ్మకాలు 1,96,524 యూనిట్లు కాగా, 2018 ఆగస్టు విక్రయాలు 2,87,198 యూనిట్లుగా సియామ్‌ వెల్లడించింది. వరుసగా 10 నెలల నుంచి పీవీ అమ్మకాలు దిగజారుతూనే ఉన్నాయి.  

మారుతి అమ్మకాల్లో 36.14 శాతం క్షీణత
పీవీ విక్రయాల్లో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకీ ఆగస్టు నెల అమ్మకాల్లో 36.14 శాతం క్షీణతను నమోదుచేసింది. గతనెల విక్రయాలు 93,173 యూనిట్లుగా సియామ్‌ వెల్లడించింది. ఇక మహీంద్ర అండ్‌ మహీంద్ర అమ్మకాలు 31.58 శాతం, హ్యుందాయ్‌ సేల్స్‌ 16.58 శాతం తగ్గాయి.

ద్విచక్ర వాహనాల సేల్స్‌ 22 శాతం డౌన్‌
ఆగస్టులో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 22.24% తగ్గాయి. గతనెల విక్రయాలు 15,14,196 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన  వాహనాలు 19,47,304.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మళ్లీ 11,000 పైకి నిఫ్టీ..

‘బీమా’ సంగతేంటి..?

ఐటీ కంపెనీలో 10వేల ఉద్యోగాలు

దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం

లాభాల్లోకి మార్కెట్ల రీబౌండ్

పండుగ సీజన్‌ : రుణాలపై గుడ్‌ న్యూస్‌

సూపర్‌ వాటర్‌ ఫిల్టర్‌ : ధర రూ. 30

10వేల ఉద్యోగాలిస్తాం: జొమాటో సీఈవో

నష్టాల్లో సూచీలు, బ్యాంకింగ్‌ ఢమాల్‌

ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!

పండుగ ఆఫర్లపై భగ్గుమన్న ట్రేడర్లు..

అయిదేళ్లలో 10 కోట్లు

కొత్త ఫీచర్స్‌తో ఒప్పో రెనో 2జెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌

ఎగుమతులకు త్వరలోనే వరాలు

అమ్మకానికి ఐవీఆర్‌సీఎల్‌

గోల్డ్‌ బాండ్‌ ధర రూ.3,890

రెండేళ్లలో పేటీఎం ఐపీఓ!

టెక్‌ మహీంద్రాకు భారీ డీల్‌

అమెజాన్‌ ఆఫ్‌లైన్‌

సెన్సెక్స్‌ 337 పాయింట్లు అప్‌

ఫేస్‌బుక్‌కు మరో షాక్‌

ఫేస్‌బుక్‌లో రహస్య ప్రేమ!

వారాంతంలో భారీ లాభాలు :   బ్యాంక్స్‌, ఆటో జూమ్‌

వివో జెడ్‌1 ఎక్స్‌ :  సూపర్‌ ఫీచర్లు

లాభాల జోరు, ట్రిపుల్‌ సెంచరీ

స్టాక్‌ మార్కెట్లకు గ్లోబల్‌ జోష్‌..

కో వర్కింగ్‌... ఇపుడిదే కింగ్‌!!

59 నిమిషాల్లోనే బ్యాంక్‌ రుణాలు

లెనొవొ నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు

ఎస్‌బీఐతో ఈఎస్‌ఐసీ అవగాహన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా పెళ్లి తిరుపతిలోనే...

వంట నేర్చుకోను

ప్రేమకథ మొదలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?