ద్రవ్యోల్బణం లక్ష్యాలు భారత్‌కు సానుకూలం

8 Aug, 2016 00:31 IST|Sakshi
ద్రవ్యోల్బణం లక్ష్యాలు భారత్‌కు సానుకూలం

రేటింగ్ కోణంలో మూడీస్ అంచనా
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్లూ ‘ప్లస్ 2 అండ్ మైనస్ 2తో’ నాలుగు శాతంగా ఉండాలన్న కేంద్రం లక్ష్యం భారత్‌కు క్రెడిట్ పాజిటివ్ అంశమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డారీ డిరోన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే గరిష్ట పరిమితి 6 కాగా, తగ్గితే కనిష్ట పరిమితి 2 శాతంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల నిర్ధేశించిన సంగతి తెలిసిందే.  డిపాజిట్లపై ఇటీవల తగ్గించిన వడ్డీరేట్లు, వాస్తవ రిటర్న్స్ వంటి అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ  తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య అవగాహన కుదరటం తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు