జెట్‌ ఉద్యోగులకు జీతాల్లేవ్‌..! 

4 Oct, 2018 00:56 IST|Sakshi

సెప్టెంబర్‌ జీతాల్లో జాప్యం 

ఇంకా అందని ఆగస్టు జీతాలు

న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,300 కోట్ల నష్టాలను ప్రకటించి, వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలను నమోదుచేసిన ఈ సంస్థ.. కనీసం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారింది. రూ.75వేలకు మించి జీతాలు ఉన్నటువంటి ఏ1–ఏ5, ఓ2, ఓ3 గ్రేడ్‌ ఉద్యోగులకు అక్టోబరు ఒకటిన జీతాలు అందగా.. ఎం1, ఎం2, ఈ1, ఇతర గ్రేడ్‌ల వారికి ఇంకా వేతనాలు అందలేదని వెల్లడైంది.

ఈ అంశంపై సంస్థ ఉద్యోగి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా ప్రతినెలా 1వ తేదీన జీతాలు వస్తాయి. గతనెలలో మాత్రం సీనియర్‌ మేనేజ్‌మెంట్, పైలెట్లు, ఇంజనీర్లను మినహాయించి.. మిగిలిన ఉద్యోగులందరికీ వేతనాన్ని సరియైన సమయానికే చెల్లించారు. అయితే, ఈసారి సెప్టెంబర్‌ వేతనాన్ని మాకు ఇప్పటికీ చెల్లించలేదు.’ అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు