నిఫ్టీ 10వేల కిందికి దిగజారుతుందా?

19 Mar, 2018 14:40 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచ సంకేతాలు ఒకమేరకు సానుకూలంగానే  ఉన్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి.  ముఖ్యంగా  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్ పాలసీ సమీక్ష.. ఇటు ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం  లాంటి కీలక అంశాల నేపథ్యంలోఇన్వెస్టర్ల అమ్మకాలుకొనసాగుతున్నాయి.. ప్రస్తుతం  సెన్సెక్స్‌ 233 పాయింట్లు క్షీణించి  33,000 మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ 89 పాయింట్లు తిరోగమించి 10,106వద్ద ట్రేడ్‌ అవువతోంది.  వెరసి 2018లో కనిష్టాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు 10వేల స్థాయిని కూడా నిఫ్టీ బ్రేక్‌ చేస్తుందా అనే సందేహాలు మార్కెట్‌ వర్గాల్లో నెలకొంది.

బ్యాంక్‌ నిఫ్టీ 300పాయింట్లకుపైగా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే.ముఖ‍్యంగా మెటల్‌ వరుసగా నాలగవరోజు కూడా నష్టాల్లో ఉ‍న్నాయి. వీటితపాటు ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంక్స్‌, రియల్టీ,ఐటీ  నష్టపోతున్నాయి. డీఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, హెచ్‌డీఐఎల్‌, ఒబెరాయ్‌, బ్రిగేడ్‌, ఇండియాబుల్స్‌, హిందాల్కో, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, కోల్‌ఇండియా, యూపీఎల్‌ , ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా,  ఎన్‌టీపీసీ, ఎన్‌ఎండీసీ, ఐవోసీఎల్‌ నష్టపోతుండగా,  లుపిన్‌, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, మారికో స్వల్పంగా లాభపడుతున్నాయి.   

 

మరిన్ని వార్తలు