నెట్ న్యూట్రాలిటీపై కేంద్రానికి 73వేలకు పైగా కామెంట్స్

21 Aug, 2015 01:28 IST|Sakshi
నెట్ న్యూట్రాలిటీపై కేంద్రానికి 73వేలకు పైగా కామెంట్స్

న్యూఢిల్లీ : వివాదాస్పదమైన నెట్ న్యూట్రాలిటీ అంశంపై కేంద్రానికి 73,326 మంది తమ అభిప్రాయాలు తెలిపారు.  టెలికం శాఖ నివేదిక మీద మైగవ్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్లో వీటిని పొందుపర్చారు. నెట్ యూజర్లకు అందించే వెబ్‌సైట్లపై పక్షపాత ధోరణి లేకుండా టెలికం సంస్థలు తటస్థ వైఖరిని పాటించేందుకు ఉద్దేశించినది నెట్ న్యూట్రాలిటీ అంశం. కొన్ని టెల్కోలు ప్రత్యేక ప్లాన్ల పేరిట డేటా చార్జీలు లేకుండా నిర్దిష్ట వెబ్‌సైట్లను ఉచితంగా అందిస్తుండటంతో వివాదం రేగిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి టెలికం శాఖ నివేదికపై కేంద్రం ప్రజాభిప్రాయాన్ని కోరింది. దీనికి ఆగస్టు 15 డెడ్‌లైన్ అయినప్పటికీ.. కామెంట్స్ వెల్లువెత్తుతుండటంతో ఆగస్టు 20 దాకా పొడిగించింది.  ఆయా అంశాల ప్రాతిపదికన పటిష్ట నిబంధనలను కేంద్రం రూపొందించనుంది.

మరిన్ని వార్తలు