వచ్చే ఏడాది 15% రాబడి

12 Dec, 2016 15:19 IST|Sakshi
వచ్చే ఏడాది 15% రాబడి

భారత్ స్టాక్ మార్కెట్‌పై మోర్గాన్ స్టాన్లీ అంచనా

ముంబై: రెండేళ్ల నుంచి తక్కువస్థారుులో రాబడులనిస్తున్న భారత్ ఈక్విటీ మార్కెట్ 2017లో రెండంకెల లాభాల్ని అందించగలదని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈక్విటీ విలువలు కనిష్టస్థారుుకి తగ్గడం, డీమానిటైజేషన్ ప్రభావంతో తాత్కాలికంగా ఆర్థికాభివృద్ధి క్షీణించే అవకాశాలుండటం, ప్రపంచ మార్కెట్లతో భారత్ మార్కెట్ అనుసంధానమైవుండటం వంటి అంశాలు వచ్చే ఏడాది అధిక రాబడులకు కారణాలని మోర్గాన్ స్టాన్లీ తాజాగా విడుదల చేసిన నివేదిక విశ్లేషించింది. పెద్ద నోట్లను రద్దుచేయడం జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గిస్తుందని, దాంతో కార్పొరేట్ లాభాలు, మార్కెట్ తిరిగి పుంజుకోవడంలో రెండు త్రైమాసికాలవరకూ జాప్యం జరగవచ్చని పేర్కొంది. నివేదిక ముఖ్యాంశాలు....

 రూపారుు కరెన్సీ రూపంలో 2017లో భారత్ మార్కెట్ 15% రాబడినివ్వవచ్చు. 2015, 2016 సంవత్సరాల్లో ఈ రాబడి మైనస్ 3%.

సెన్సెక్స్ 30,000 పారుుంట్ల స్థారుుని చేరవచ్చు (50% అవకాశం). బుల్లిష్‌గా చూస్తే 39,000 పారుుంట్లకు పెరగవచ్చు (30% అవకాశం). 24,000 పారుుంట్లకు పతనం కావొచ్చు (20% అవకాశం).

2016-17 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ కంపెనీల లాభాలు 2.5% వృద్ధిచెందవచ్చు. 2017-18లో ఈ వృద్ధి 16%, 2018-19లో 15% వుండవచ్చు.

మరిన్ని వార్తలు