ఒక్క ప్రాపర్టీ 180కోట్లు 

21 Dec, 2018 23:03 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం హాంగ్‌ కాంగ్‌

సాక్షి, హైదరాబాద్‌:  ప్రపంచవ్యాప్తంలో అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీల ఖరీదు, అమ్మకాలు రెండింట్లోనూ హాంకాంగే కింగ్‌. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో హాంకాంగ్‌లో 2.5 బిలియన్‌ డాలర్ల అమ్మ కాలు జరిగాయని గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ ఎల్‌ఎల్‌పీ నివేదికలో తెలిపింది. అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ ఎల్‌ఎల్‌పీ ఏడాదిలో కనీ సం 3 లావాదేవీలు రూ.180 కోట్లు కంటే ఎక్కువ జరిగిన మార్కెట్స్‌ అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీలకు పరిగణించింది. అల్ట్రా ప్రైమ్‌ మార్కెట్స్‌ను నగరాలు, సెకండ్‌ హోమ్‌ డెస్టినేషన్స్, స్కై రిసార్ట్స్‌ అని మూడు రకాలుగా విభజించింది. అల్ట్రా ప్రైమ్‌ నగరాల జాబితాలో తొలి ఆరు స్థానాల్లో హాంకాంగ్, న్యూయార్క్, లండన్, సింగపూర్, లాస్‌ ఏంజిల్స్, సిడ్నీలు నిలిచాయి. సెకండ్‌ హోమ్‌ డెస్టినేషన్స్‌లో.. అమెరికాలోని మలైబు, పామ్‌ బీచ్, ఫ్రాన్స్‌లోని కోటె డిజౌర్, మోనాకో, కరేబియన్‌ దీవులు నిలిచాయి. స్కై రిసార్ట్స్‌లో.. స్విట్జర్లాండ్‌లోని సెయింట్‌ మోర్టీజ్, గ్యాస్టాద్, ఫ్రెంచ్‌లోని కోర్చెవల్, కొలరాడోలోని అస్పెన్, కొలరాడో ప్రాంతాలున్నాయి. 

హాంకాంగ్‌: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో హాంకాంగ్‌ది నంబర్‌ 1 స్థానం. ఇక్కడ కనీస లావాదేవీ విలువ 52.8 మిలియన్‌ డాలర్లు. ప్రాపర్టీలపై తక్కువ పన్నులు, మూలధన, వారసత్వ పన్నులు లేకపోవటం వంటి కారణాలతో నివాస విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది. 

లండన్‌: కనీస ప్రాపర్టీ ధర రూ.42.5 మిలియన్‌ డాలర్లు. 2015 తర్వాత లండన్‌లో స్టాంప్‌ డ్యూటీ చార్జీలను పెంచడం, బ్రెగ్జిట్‌ ప్రభావంతో లావాదేవీలు తగ్గిపోయాయి. 2015లో అల్ట్రా ప్రైమ్‌లో 72 లావాదేవీలు జరిగితే.. ఈ ఏడాదిలో 38కి తగ్గిపోయాయి.

న్యూయార్క్‌: ఈ ఏడాది న్యూయార్క్‌లో 39 అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీ లావాదేవీలు జరిగాయి. లోయర్‌ మన్‌హాట్టన్‌ (డౌన్‌టౌన్‌), మిడ్‌ టౌన్‌ మన్‌హాట్టన్, అప్పర్‌ ఈస్ట్‌ సైడ్‌ ప్రాంతాలు హాట్‌స్పాట్స్‌. 


6 నగరాలు; రూ.47,520 కోట్లు.. 
టాప్‌–6 నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో 153 లావాదేవీలు రూ.180 కోట్ల కం టే ఎక్కువ విలువ ఉన్నవి జరిగాయి. ఈ 6 నగరాల్లోని అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీల విలువ రూ.47,520 కోట్లు (6.6 బిలియన్‌ డాలర్లు). గత రెండేళ్లుగా 12 శాతం వృద్ధి నమోదవుతుంది. 47 లావాదేవీలు, 2.5 బిలియన్‌ డాలర్లతో హాంగ్‌కాంగ్‌ ప్రథమ స్థానంలో నిలి చింది. ఆ తర్వాత 39 లావాదేవీలతో న్యూయార్క్, 38 ట్రాన్సాక్షన్స్‌తో లండన్‌ నిలిచాయి. ఈ రెండు నగరాల లావాదేవీల విలువ మొత్తం 1.5 బిలియన్‌ డాలర్లు.  

మరిన్ని వార్తలు