పాల ధర పెంచేసిన మదర్ డెయిరీ

25 May, 2019 09:08 IST|Sakshi

మదర్‌ డెయిరీ  పాలు లీటర్‌కు రూ.2 పెంపు

ఇటీవల అమూల్  ధరలు కూడా పెంపు

మదర్ డెయిరీ పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచింది.మదర్ డెయిరీ పెంచిన ధరలు 25 మే 2019 నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్‌కు రూ.2, అరలీటర్‌కు రూ.1  రూపాయి చొప్పు పెరగనుంది. పెరుగుతున్న  ఖర్చుల కారణంగా ధరలు పెంచుతున్నట్టు మదర్ డెయిరీ తెలిపింది.   

పాలు సేకరణ ధరలు గత 3-4 నెలల పెరుగుదలపై నిరంతరాయంగా పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా పశుగ్రాసం వ్యయం 15-20 శాతం పెరగడం,లేబర్ కాస్ట్ పెరగడం వంటి కారణాలతో పాల ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది.  అయితే టోకెన్ మిల్క్  లేదా బల్క్ వెండర్ మిల్క్  ధరలను పెంచడం లేదు. కేవలం పోలీ ప్యాక్ మిల్క్ వేరియంట్స్‌కు ఇది వర్తిస్తుంది. 

కొత్త రేటు ప్రకారం,వెన్న శాతం అధికంగా ఉండే పాల  ధర లీటరు, 53  రూపాయలుగాను, అర లీటరు ధర రూ. 27 గాను  వుంటుంది. పూర్తిస్థాయి క్రీమ్ (ప్రీమియమ్) పాలు లీటరుకు 55 రూపాయలు, అర లీటరు రూ.28 గాను వుంటుంది.  డబుల్ టోన్ మిల్క్ (లైవ్ లైట్) ధరను 34 రూపాయల నుంచి లీటరుకు 36 రూపాయలకు పెరిగింది. అరలీటరు ధర 18 నుంచి 19 రూపాయలకు పెరిగింది. స్కిమ్‌డ్‌  అరలీటరు పాల ధరను కూడా  ఒక రూపాయి( రూ.20 నుంచి 21 రూపాయలకు) పెంచింది. అయితే  అరలీటరు ఆవు పాల ధరను ఒక రూపాయి పెంచింది. కానీ, లీటరు ధరలో లాంటి మార్పు లేదు.

కాగా ఇప్పటికే అమూల్ పాల ధరలను పెంచింది. నాలుగు రోజుల క్రితం లీటర్‌కు రూ.2 పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు