బిగ్‌ స్క్రీన్‌, మాసివ్‌ బ్యాటరీ : బడ్జెట్‌ ధర

30 Jun, 2018 18:34 IST|Sakshi

సాక్షి,ముంబై: మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే లాంచ్‌ చేయనుంది. మోటో ఈ5ప్లస్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేయనుంది. అనంతరం మోటోఈ5ను లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ బిగ్‌ బ్యాటరీ, బిగ్‌ స్క్రీన్‌, బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ ట్విటర్‌లో వరుసగా టీజర్లు వదులుతోంది. పాక్డ్‌ విత్‌ మాసివ్‌ బ్యాటరీ, బహుమతులూ  అంటూ ఊరిస్తోంది. మోటో ఈ4 ప్లస్‌ సక్సెసర్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు 10వేల రూపాయలుగా నిర్ణయించవచ్చని సమాచారం. జూలై మాసంలోనే లాంచ్‌ కానుందని భావిస్తున్న ఈ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు ఇలా ఉన్నాయి:

మోటో ఈ5ప్లస్‌ ఫీచర్లు
6.6 అంగుళాల డిస్‌ ప్లే
1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
720x1440పిక్సెల్స్‌రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌ 32 జీబీ స్టోరేజ్‌
256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
5 ఎంపీ సెల్ఫీకెమెరా
12ఎంపీ రియర్‌ కెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరిన్ని వార్తలు