మోటరోలా 2 కొత్త స్మార్ట్‌ఫోన్లు

5 Jun, 2018 00:21 IST|Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘మోటరోలా’ తాజాగా మోటో జీ6, మోటో జీ6 ప్లే పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను భారత  మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిలో మోటో జీ6 ప్లే ధర రూ.11,999. మోటో జీ6 ధర రూ.13,999 నుంచి ప్రారంభమౌతోంది.

మోటో జీ6లో 5.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే (18:9 రేషియో), క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్, 12 ఎంపీ+5 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్‌–32 జీబీ మెమరీ/ 4 జీబీ ర్యామ్‌–64 జీబీ మెమరీ, ఓరియో 8.0 ఓఎస్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది.

ఇక మోటో జీ6 ప్లేలో  5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే (18:9 రేషియో), 13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ,  వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. మోటో జీ6 స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో, మోటో జీ6 ప్లే స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు