మెగా బ్యాటరీతో మోటరోలా జీ7 పవర్

15 Feb, 2019 15:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆకట్టుకునే ఫీచర్లతో మోటరోలా  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. 5వేల ఎంఏహెచ్‌ మెగా బ్యాటరీతో మోటరోలా జీ7 పవర్‌ మొబైల్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. 15వాట్స్‌ టర్బోపవర్ సపోర్ట్  బ్యాటరీ, ఫింగర్‍‌ ప్రింట్ స్కానర్‌ ప్రత్యేక ఫీచర్లని కంపెనీ చెబుతోంది. మొదటిసారిగా ఇండియాలో ఆఫ్‌లైన్ స్టోర్లల్లో కూడా ఈ ఫోన్ విక్రయానికి లభ్యం. మోటరోలా.ఇన్‌ వెబ్‌సైట్‌, మోటో స్టోర్ లేదా మోటో హబ్, సిటీ, స్టేట్ ఎంచుకొని ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.  త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. 


మోటరోలా జీ7 పవర్  ఫీచర్లు
6.24 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+డిస్‌ప్లే
720x1570 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 9.0
స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్
 4 జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
12ఎంపీ రియర్‌  కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ 

ధర: రూ.13,999
 

మరిన్ని వార్తలు