మోటరోలా జి 8 పవర్ లైట్‌ రేపే లాంచింగ్: ధర?

20 May, 2020 20:57 IST|Sakshi

గురువారం ఫ్లిప్‌కార్ట్లో  జీ 8 పవర్ లైట్‌

బడ్జెట్ ధరతో, రెడ్ మి 8, రియల్ మి నార్జాలకు పోటీ

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా  వైరస్ కట్టడికోసం విధించిన   లాక్‌డౌన్‌  ఆంక్షల్లో క్రమంగా సడలింపుల నేపథ్యంతో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త ఉత్పత్తుల  లాంచింగ్  సిధ్దపడుతున్నాయి.   ముఖ్యంగా  మోటరోలా తన ఎడ్జ్ + ఫ్లాగ్‌షిప్‌ను  భారత మార్కెట్లో   రేపు (గురువారం) లాంచ్ చేయనుంది.  మోటో జి సిరీస్‌లో భాగంగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది.   జీ 8 పవర్ లైట్‌ పేరుతో తీసుకొస్తున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్  5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,ట్రిపుల్ రియర్ కెమెరా, అద్భుతమైన డిజైన్ తో రానుందని కంపెనీ చెప్పింది.  ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రారంభించనుంది. బడ్జెట్ ధరలో రానున్న ఇది రెడ్ మి 8, రియల్ మి నార్జాలకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.


మోటరోలా జీ8 పవర్ లైట్  ఫీచర్స్
6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
మీడియాటెక్ హీలియో పీ35ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
4 జీబీ  ర్యామ్ 64 జీబీ స్టోరేజ్
16+2+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ధర: సుమారు రూ.10,000

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు