మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌

24 Sep, 2018 17:46 IST|Sakshi

మిడ్‌ రేంజ్‌లో తొలి ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌

15 వాట్స్‌ టర్బో చార్జర్‌

మోటరోలా వన్‌ పవర్‌

ధర రూ.15,999

సాక్షి, న్యూఢిల్లీ: లెనోవోకు చెందిన మొబైల్‌ మేకర్‌ మోటరోలా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం లాంచ్‌  చేసింది.  మోటరోలా వన్‌ పవర్‌ పేరుతో  భారతదేశ మార్కెట్లోకి  మొట్టమొదటి ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌  విడుదల  చేసింది.  ఈ ఫోన్‌ ధరను రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది.  అక్టోబరు 5వ తేదీన ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ద్వారా ప్రీ బుకింగ్‌ కోసం ఈ రోజునుంచే అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇది డఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, భారీ స్క్రీన్‌, 15 వాట్స్‌ టర్బోచార్జర్‌,  మెటల్‌ డిజైన్‌,  టాప్‌ ఫీచర్స్‌గా కంపెనీ  చెబుతోంది.

మోటరోలా వన్‌ పవర్‌
6.2 అంగుళాల డిస్‌ప్లే విత్‌ నాచ్‌
1.8 గిగాహెడ్జ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
16+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు