సూపర్‌ ఫీచర్లతో మోటరోలా వన్‌ విజన్‌ లాంచ్‌

20 Jun, 2019 12:57 IST|Sakshi

మోటరోలా వన్‌ విజన్‌

ధర రూ. 19,999

సినిమా విజన్‌ డిస్‌ప్లే

48+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌  కెమెరా

 సాక్షి, ముంబై :  మోటరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఇండియామార్కెట్లోలాంచ్‌ చేసింది. ఇటీవల గ్లోబల్‌ గా లాంచ్‌ చేసిన ‘వ‌న్ విజన్‌’   స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇక్కడ విడుదలచేసింది. దీని ధరను రూ. 19,999 గా నిర్ణయించింది. ఆధునిక ఫీచర్లు,  ప్రధానంగా    సినిమా విజన్‌ డిస్‌ప్లే, నైట్‌ విజన్‌ ఫీచర్‌తో 48, 5 మెగా పిక్సెల్‌ సామర్ధ్యం గల  డబుల్‌ రియర్‌  కెమెరా లాంటి  ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్‌తో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.

మోటరోలా వ‌న్ విజ‌న్ ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ డిస్‌ప్లే
శాంసంగ్‌ ఎగ్జినోస్ 9609 ఆక్టాకోర్‌ ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
1080x2520  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
48+5 ఎంపీ  డబుల్‌ రియర్‌  కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

మరిన్ని వార్తలు