మోటరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌ అంచనాలు హల్‌చల్‌

13 Nov, 2019 13:19 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: మోటరోలాకు చెందిన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఫో‍ల్డబుల్‌ డివైస్‌లపై భారీ క్రేజ్‌ నెలకొన్న నేపథ్యంలో మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మోటరోలా తన ఐకానిక్‌ మోడల్‌ మొబైల్‌ను మళ్లీ తీసుకొస్తోంది. అత్యుత్తమ ఫీచర్స్‌తో ఫోల్డబుల్‌ డిస్‌ప్లేతో తన పాపులర్‌ మోడల్‌ 'మోటరోలా రాజర్'ను తీసుకురాబోతోంది. మోటరోలా రాజర్ 2019 పేరుతో అదీ  ఫ్లిప్‌ తరహాలోనే ఆ విష్కరించనుంది. 

లెనోవా యాజమాన్యంలోని సంస్థ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో  నిర్వహించే ఈవెంట్‌లో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుందని భావిస్తున్నారు. మోటరోలా మీడియా ఆహ్వానంలో ఈ సంకేతాలను అందించింది. శాంసంగ్‌, హువావే ఫోన్లకంటే భిన్నంగా దీన్ని తీసుకొరానుంది. ధర విషయానికి వస్తే.. యూరో 1,500 (సుమారు రూ. 1,18,500) ధర ట్యాగ్‌తో వస్తుందని అంచనా.


మోటరోలా రాజర్ 2019 ఫీచర్లపై అంచనాలు
6.2 అంగుళాల డిస్‌ప్లే 
876x2142 పిక్సెల్స్ రిజల్యూషన్‌
కవర్ డిస్‌ప్లే 600x800 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 సాక్‌
6 జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్
 2730 ఎంఏహెచ్ బ్యాటరీ

>
మరిన్ని వార్తలు