షావోమికి షాక్ ‌: మోటరోలా స్మార్ట్‌టీవీలు

16 Sep, 2019 16:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్స్ తయారీదారు లెనోవా సొంతమైన మోటరోలా భారత మార్కెట్‌లో చవక ధరలకే పలు ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ సహకారంతో 32, 43, 50, 55, 65 ఇంచుల డిస్‌ప్లే పరిమాణాల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలనునేడు (సోమవారం) లాంచ్‌ చేసింది. భారతదేశంలో స్మార్ట్‌టీవీలకు పెరుగుతున్నఆదరణ నేపథ్యంలో స్మార్ట్టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టడానికి వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొత్త వ్యూహంతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. ప్రధానంగా షావోమికి షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ సందర్భంగా సెప్టెంబర్ 29 నుంచి ఈ టెలివిజన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. దాదాపు షావోమి ఎంఐ టీవీల మాదిరి ఫీచర్లు, అదే ధరతో వీటిని తీసుకొచ్చింది. మరోవైపు షావోమి  రేపు భారతదేశంలో 65 అంగుళాల టీవీని విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

మోటరోలా తీసుకొచ్చిన ఆరు టీవీలు ఆండ్రాయిడ్‌ 9 ఆధారంగా, నిరంతరాయమైన గేమింగ్ అనుభవం కోసం గేమింగ్ కంట్రోలర్‌ సపోర్ట్‌తో పనిచేస్తాని కంపెనీ తెలిపింది. స్క్రీన్ షిఫ్ట్, ఆటోటూన్ఎక్స్ డిస్ప్లే టెక్నాల. జీ10 బిట్ కలర్ డెప్త్ లాంటి ఫీచర్లు జోడించింది. 49, 55 అంగుళాల టీవీలు 2జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, మాలి-450 జిపియు,  64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. 32,  43-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ టీవీలు 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 20 డబ్ల్యూ సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయి

32 అంగుళాల హెచ్‌డీ రెడీ టీవీ ధర రూ.13,999 
43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టీవీ ధర రూ.24,999
43 అంగుళాల 4కె టీవీ ధర రూ.29,999
50 అంగుళాల 4కె టీవీ ధర రూ.33,999
55 అంగుళాల 4కె టీవీ ధర రూ.39,999
65 అంగుళాల  4కె స్మార్ట్‌ టీవీ ధ‌ర‌ను రూ.64,999

మరిన్ని వార్తలు