దారుణంగా పడిపోయిన ఎంఆర్‌ఎఫ్‌ లాభాలు

4 Aug, 2017 18:59 IST|Sakshi
దారుణంగా పడిపోయిన ఎంఆర్‌ఎఫ్‌ లాభాలు

ముంబై:  టైర్ల తయారీ దిగ్గజ కంపెనీ ఎంఆర్ఎఫ్ లిమిటెడ్  లాభాలు దారుణంగా పడిపోయాయి.   ఎంఆర్ఎఫ్ క్యూ 1 లో నికర లాభం 78 శాతం క్షీణించింది. ఉత్పత్తి ఖర్చలు పెరగడం మూలంగా కంపెనీ లాభాలు క్షీణించాయని మార్కెట్‌ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

జూన్ 30 తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం 78.30 శాతం పడిపోయింది. రూ. 106.53 కోట్ల నికర లాభాలను  ఆర్జించినట్టు కంపెనీ బిఎస్ఇ  ఫైలింగ్‌ లో  తెలిపింది.
అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికరలాభం రూ. 490.93 కోట్లుగా నమోదైంది. అలాగే ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 4,060.93 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,955.93 కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం 21.01 శాతం పెరిగి రూ .3,926.31 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .3,244.45 కోట్లు.

 దీంతో స్టాక్‌మార్కెట్‌ లో బాహుబలి  షేరుగా పేరొందిన ఎంఆర్‌ఎఫ్‌  స్టాక్‌ బిఎస్ఇలో  2.57 శాతం  నష్టపోయి  67,400 రూపాయల వద్ద ముగిసింది.
 

మరిన్ని వార్తలు