ఎంఎస్‌ఎంఈలపై నోట్ల రద్దు దెబ్బ..

6 Jan, 2017 01:08 IST|Sakshi
ఎంఎస్‌ఎంఈలపై నోట్ల రద్దు దెబ్బ..

క్రిసిల్‌ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ:  పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలు(ఎంఎస్‌ఎంఈ)పై తీవ్రంగానే ప్రభావం చూపుతోందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తెలిపింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో ఎంఎస్‌ఎంఈ రంగం వృద్ధి తగ్గుతుందని దేశవ్యాప్తంగా నిర్వహించిన తమ సర్వేలో తేలిందని పేర్కొంది. చెప్పుకోదగ్గ స్థాయిలో  క్లయింట్లు నగదు లావాదేవీల నుంచి నగదు రహిత లావాదేవీలకు మారినప్పటికీ, ఎంఎస్‌ఈ రంగం కుదటపడలేదని సర్వే పేర్కొంది. ముఖ్యాంశాలు...

నగదు లావాదేవీలపైననే అధికంగా ఆధారపడిన టెక్స్‌టైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఉక్కు, కన్సూమర్‌ డ్యూరబుల్స్, నిర్మాణ, వాహన సంబంధ ఎంఎస్‌ఎంఈలపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రం.
వ్యవస్థీకృతరంగంలోని సంస్థల కంటే అవ్యవస్థీకృత రంగంలోని(పది మంది కంటే తక్కువ ఉద్యోగులున్న) సంస్థల్లోనే  అధిక సమస్యలు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో వ్యవస్థీకృత రంగ ఎంఎస్‌ఎంఈల్లో 25% సంస్థలు అవ్యవస్థీకృత రంగంలోని ఎంఎస్‌ఎంఈల్లో 37% సంస్థలు ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత తమ క్లయింట్లు చెక్కులు, ఎలక్ట్రానిక్‌ విధానాల ద్వారా చెల్లింపులకు మారారని 41 శాతం ఎంఎస్‌ఎంఈలు చెప్పాయి.
పెద్ద నోట్ల రద్దు కారణంగా రోజు వారీ లావాదేవీలు ప్రభావితం అవుతాయని, స్వల్ప వృద్ధి మాత్రమే నమోదవుతాయని పలు సంస్థలు ఆవేదన వ్యక్తం చేశాయి.
అయితే నోట్ల రద్దు ఎంఎస్‌ఎంఈల వ్యాపార నిర్వహణ తీరులో భారీ మార్పులు తీసుకొచ్చింది.
డీమోనిటైజేషన్‌  ప్రభావం స్వల్పకాలమేనని పలు ఎంఎస్‌ఎంఈలు అంచనా వేస్తున్నాయి.
జూన్‌కల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయ నేది నాలుగింట మూడొంతుల సంస్థల అంచనా.
పెద్ద నోట్ల రద్దు ఎంఎస్‌ఎంఈల లిక్విడిటీపై కూడా దెబ్బకొట్టింది. రుణ చెల్లింపుల్లో సమస్యలు ఎదుర్కొంటున్నామని మూడింట రెండొంతుల సంస్థలు పేర్కొన్నాయి. స్నేహితులు, బంధువుల నుంచి చేబదుళ్లు, రుణాలు పూర్తిగా  నిలిచాయి.

మరిన్ని వార్తలు