1.46 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఎమ్‌ఎస్‌టీసీ ఐపీఓ 

21 Mar, 2019 00:39 IST|Sakshi

ఈ నెల 29న స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌

న్యూఢిల్లీ: ఎమ్‌ఎస్‌టీసీ కంపెనీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) 1.46 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ  1.76 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. దీనికి గాను 2.58 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఐపీఓ గత శుక్రవారమే ముగియాల్సి ఉంది. స్పందన పెద్దగా లేకపోవడంతో  ఈ ఐపీఓను బుధవారం వరకూ పొడిగించారు. ప్రైస్‌బ్యాండ్‌ను కూడా రూ.121–128 నుంచి రూ.120–128కు సవరించారు. అయినా అంతంత మాత్రం స్పందన మాత్రమే లభించింది.
 

ఈ కంపెనీ షేర్లు ఈ నెల 29న తేదీన స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ట్రేడింగ్‌ కంపెనీగా 1964లో ఏర్పాటైన ఈ కంపెనీ ప్రస్తుతం మూడు విభాగాల్లో–ఈ కామర్స్, ట్రేడింగ్, రీసైక్లింగ్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

మరిన్ని వార్తలు