ఫోర్బ్స్ ఆ జాబితాలో ముఖేషే టాప్

17 May, 2017 10:40 IST|Sakshi
ఫోర్బ్స్ ఆ జాబితాలో ముఖేషే టాప్
న్యూయార్క్ : ఫోర్బ్స్ రూపొందించిన 'గ్లోబల్ గేమ్ ఛేంజర్స్' జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల జీవనంలో మార్పులు తీసుకురావడం, ఇండస్ట్రీస్ ఏర్పాటుచేయడంలో తన సత్తా చాటినందుకు ముఖేష్ అంబానీకి ఈ స్థానం దక్కింది. ఫోర్బ్స్ ఈ గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాను రూపొందించడం ఇది రెండో సారి. 25 మంది ధైర్యవంతమైన నాయకులతో కూడిన ఈ జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. ఇందులో అంబానీ టాప్ స్థానంలో నిలిచారు. భారత్ లో అత్యధిక మొత్తంలో ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడంలో ఆయన గేమ్ ఛేజింగ్ సత్తాను ఫోర్బ్స్ కొనియాడింది.
 
''ఆయిల్ నుంచి గ్యాస్ వరకు వ్యాపారాల్లో  హవా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఉచిత ఆఫర్లు, అత్యంత చవకైన ధరలతో చాలా వేగవంతమైన ఇంటర్నెట్ ను ఆఫర్ చేసింది. ఆరు నెలల కాలంలోనే 100 మిలియన్ కస్టమర్ల మార్కును పొందింది'' అని రిలయన్స్ జియోను ఉద్దేశించి ఫోర్బ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ను కొనియాడింది. ఈ జాబితాలో హోమ్ అప్లియన్స్  డైసన్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ డైసన్, అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ బ్లాక్ రాక్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పింక్, సౌదీ అరేబియా డిప్యూటీ క్రౌన్ మహమ్మద్ బిన్ సల్మాన్,  స్నాప్ సహ వ్యవస్థాపకుడు ఇవాన్ స్పీగల్, చైనీస్ రైడ్ షేరింగ్ దిగ్గజం దిది చుక్సింగ్ వ్యవస్థాపకుడు చోటు దక్కించుకున్నారు.  
 
మరిన్ని వార్తలు