మళ్లీ ముకేశ్ అంబానీ టాప్...

3 Mar, 2015 01:50 IST|Sakshi
మళ్లీ ముకేశ్ అంబానీ టాప్...

- ‘ఫోర్బ్స్’ భారతీయ బిలియనీర్లలో అగ్రస్థానం; సంపద 21 బిలియన్ డాలర్లు
- ప్రపంచ జాబితాలో 39వ ర్యాంక్

వాషింగ్టన్: భారత బిలియనీర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ 8వ సారి అగ్రస్థానంలో నిలిచారు.  21 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ప్రపంచ జాబితాలో ముకేశ్ 39వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ శాంఘ్వీ 20 బిలియన్ డాలర్లతో 44వ స్థానంలో ఉన్నారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 19 బిలియన్ డాలర్లతో 48వ స్థానంలో ఉన్నారు.  
     
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 79.2 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 16వ సారి అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాతి స్థానంలో 77.1 బిలియన్ డాలర్లతో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ రెండో స్థానంలో, 72.7 బిలియన్ డాలర్లతో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు.
గతేడాది 1,645గా ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 1.826కి పెరిగింది.
వీరి ఆస్తి విలువ మొత్తంగా 7.05 ట్రిలియన్ డాలర్లుకాగా, సగటు 3.86 బిలియన్ డాలర్లు.
ఆసియా-ఫసిఫిక్‌లో 562, యూఎస్‌లో 536, యూరప్‌లో 482 బిలియనీర్లు ఉన్నారు.
గతేడాది 172గా ఉన్న మహిళ బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 197కు చేరింది.
అతి చిన్న వయసులో బిలియనీర్ల జాబి తాకెక్కిన వ్యక్తి స్నాప్‌చాట్ సీఈఓ ఈవన్ స్పీగెల్ (24). సంపద విలువ 1.5 బిలియన్ డాలర్లు.

మరిన్ని వార్తలు