ముకేశ్‌ అంబానీ భావోద్వేగం

22 Jul, 2017 08:10 IST|Sakshi
ముకేశ్‌ అంబానీ భావోద్వేగం

ముంబై: బిలియనీర్‌,  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత  ముకేశ్‌ అంబానీ సాధారణ వార్షిక  సభ్య సమావేశంలో  భావోద్వేగానికి లోనయ్యారు.  కంపెనీ   సాధించిన విజయాలను, చేరుకున్న లక్ష్యాలను వివరిస్తూ  తండ్రి,  ఫౌం​డర్‌ చైర్మన్‌ ధీరూబాయ్‌ అంబానీని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అమ్మ కోకిలా బెన్‌కు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో అక్కడే ఉన్న ధీరూ భాయ్‌ సతీమణి, ముకేశ్‌ తల్లి కోకిలా బెన్‌ కంటతడిపెట్టారు. దీంతో  సమావేశంలో ధీరూభాయ్‌ జిందాబాద్‌ నినాదాలు మిన్నంటాయి.

1977లో 3500మంది ఉద్యోగులతో టెక్స్‌టైల్‌  కంపెనీ ఉన్న ఆవర్భవించిన సంస్థ   నేడు ప్రపంచవ‍్యాప్తంగా  రెండులక్షల 50 వేల మంది ఉద్యోగులతో విశిష్ట సేవలందిస్తోందని ప్రకటించారు. గత నాలుగుదశాబ్దాలుగా  ఖాతాదారులకు సేవలందింస్తున్న సంస్థ  అద్భుతమైన విజయాలను సాధించిందిన్నారు.   రూ. 33 కోట్ల టర్నోవర్ నుంచి రూ. 3.3 లక్షల కోట్ల టర్నోవర్‌తో గ్లోబల్‌ కంపెనీగా అవతరించిందంటూ సంతోసం వ్యక్తం చేశారు. రిలయన్స్‌ సాధించిన విజయాన్ని దేశంలోని ఏ  కార్పొరేట్‌ కంపెనీ సాధించలేదని చెప్పారు. ఈ సందర్భంగా   ప్రధానమంత్రి  నరేంద్రమోదీకి  ముకేశ్‌  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


 

మరిన్ని వార్తలు