ఎయిర్‌లైన్స్‌, మల్టీప్లెక్స్‌ షేర్ల జోరు

4 Jun, 2020 16:28 IST|Sakshi

గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఎయిర్‌లైన్స్‌, మల్టీప్లెక్స్‌ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. లాక్‌డౌన్‌లో కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తుండడంతో  సాధారణ పరిస్థితులు నెలకొని, త్వరలో ప్రయాణాలు పుంజుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో నేడు ఎయిర్‌లైన్స్‌ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌(ఇండిగో) షేరు 9.2 శాతం లాభపడి రూ.1,117.90 వద్ద ముగిసింది. ఉదయం రూ.1,025 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.1,125 వద్ద గరిష్టాన్ని తాకింది. మరో ఎయిర్‌లైన్‌ సంస్థ స్పైస్‌జెట్‌ 5 శాతం లాభంతో రూ.46.85 వద్ద ముగిసింది. 
జూన్‌ తర్వాత సినిమా హళ్లు తెరుచుకునే అవకాశం ఉండడంతో నేడు ఎన్‌ఎస్‌ఈలో మల్టీ ప్లెక్స్‌ షేర్లు సైతం ర్యాలీ చేశాయి. వీటిలో ముఖ్యంగా పీవీఆర్‌ షేరు 7 శాతం లాభపడి రూ.1,074 వద్ద ముగిసింది. ఉదయం సెషన్‌లో రూ.990 వద్ద ప్రారంభమైన పీవీఆర్‌ షేరు ఒక దశలో రూ.1,103వద్ద గరిష్టాన్ని తాకింది. మరో కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ షేరు 16 శాతం లాభపడి రూ.270 వద్ద ముగిసింది. ఉదయం సెషన్‌లో రూ.236 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.279 వద్ద గరిష్టాన్ని చేరింది. కాగా లాక్‌డౌన్‌తో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడం, సినిమాహాళ్లు మూతపడడంతో గత రెండు నెలలుగా ఈ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

Related Tweets
మరిన్ని వార్తలు