మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ. 10 లక్షల కోట్లు

3 Oct, 2014 03:22 IST|Sakshi
మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ. 10 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ 7.2 శాతం ఎగిసింది. రూ. 10.6 లక్షల కోట్లకు చేరింది. భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం అంతక్రితం త్రైమాసికంలో ఇది రూ. 9.87 లక్షల కోట్లుగా నమోదైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ మే నెలలో తొలిసారిగా ఏయూఎంల విలువ తొలిసారిగా రూ. 10 లక్షల కోట్ల మార్కును దాటింది.

ప్రస్తుతం 45 ఫండ్ హౌస్‌లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ రూ. 1.41 లక్షల కోట్ల ఏయూఎంతో అగ్రస్థానంలోను, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ రూ. 1.27 లక్షల కోట్లతో రెండో స్థానంలో, రిలయన్స్ ఎంఎఫ్ రూ. 1.22 లక్షల కోట్ల ఏయూఎంతో మూడో స్థానంలో ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు