రిటైర్మెంట్‌ నిధి కోసం.. ఇండెక్స్‌ ఫండా ? ఈక్విటీ ఫండా ?

7 May, 2018 02:05 IST|Sakshi

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ను ఎంచుకుంటే మంచిదని మిత్రులు చెబుతున్నారు.  డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? – వినయ్, విశాఖపట్టణం  
డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పెద్దగా ఎలాంటి ప్రయోజనాలు లభించవు. అంతేకాకుండా ఇది సరైన పెట్టుబడి నిర్ణయం కూడా కాదు. దీనికి బదులుగా డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే కొద్దో గొప్పో ప్రయోజనాలుంటాయి. కానీ, డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీకు క్రమబద్ధంగా డివిడెండ్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి.

కానీ డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ను ఎంచుకుంటే మీకు డివిడెండ్‌లు రావు. పైగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ప్రకటించే డివిడెండ్‌ను పూర్తిగా రీఇన్వెస్ట్‌మెంట్‌ చేసే వీలూ ఉండదు. డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో.. మీకు వచ్చే డివిడెండ్‌లో  మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ డీడీటీ కోత వేస్తుంది. ఈ మేరకు మీకు నష్టం వస్తుంది. ఉదాహరణకు మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ రూ. వంద డివిడెండ్‌ ప్రకటించిందనుకుందాం.

దీంట్లో డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)గా రూ. 10ను మినహాయించి మిగిలిన రూ.90ను మాత్రమే  సదరు మ్యూచువల్‌ ఫండ్‌ రీఇన్వెస్ట్‌ చేస్తుంది. మీకు రూ.10 నష్టం వస్తుంది. అందుకని డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌కు దూరంగా ఉండడమే మేలు. కావాలనుకుంటే దీంట్లో గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని వల్ల మీరు ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల ఎన్‌ఏవీ(నెట్‌ అసెట్‌ వేల్యూ) మరింతగా పెరుగుతుంది.  

నేను ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్నాను. నా వయస్సు 34 సంవత్సరాలు. నా రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా లేక ఇండెక్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ?     – కరీమ్, వరంగల్‌
రిటైర్మెంట్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయడానికి మీకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏదైనా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, రెండోది ఇండెక్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం. దేంట్లో ఇన్వెస్ట్‌ చేసినా సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)విధానాన్ని తప్పకుండా పాటించాలి. మీ ప్రస్తుత వయస్సు 34 సంవత్సరాలు. మీరు 20 ఏళ్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయడానికి వీలుంటుంది.  ఇండెక్స్‌ ఫండ్స్‌కు భారత్‌లో సరైన కాలం ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. మంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌.. ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు, ఇరవై ఏళ్ల కాలానికి మంచి రాబడులే ఇవ్వగలవు.

ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు అంతంతమాత్రంగానే ఉంటాయి. కానీ టైమ్‌ పెరుగుతున్న కొద్దీ, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే రాబడులు కూడా పెరుగుతాయి. ఇక ఇండెక్స్‌ ఫండ్స్‌ విషయానికొస్తే, మన ఇండెక్స్‌లు బలహీనంగా ఉన్నాయి. ప్రాతినిధ్యం ప్రాతిపాదికతోనే సూచీల్లో(సెన్సెక్స్, నిఫ్టీల్లో) స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. దీంతో సూచీల పనితీరు అంతంతమాత్రంగానే ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  ఇండెక్స్‌ ఆధారిత ఇండెక్స్‌ ఫండ్స్‌ మంచి రాబడులు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకని రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఇండెక్స్‌  ఫండ్స్‌కంటే కూడా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే ఉత్తమం.

ఒకటి లేదా రెండు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో క్రమబద్ధంగా ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగించండి. ప్రతి రెండేళ్లకొకసారి మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్స్‌ పనితీరును మదింపు చేయండి. ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోల్చితే మీరు ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ ఫండ్స్‌ పనితీరు బాగా లేకపోతే, ఆ ఫండ్స్‌ నుంచి మారిపోండి. ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలైన–పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం రిటైర్మెంట్‌ అవసరాల కోసం మంచి నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు.  

నేను ఒక ట్యాక్స్‌ సేవింగ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ ఫండ్‌లో డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకున్నాను. ఇప్పుడు గ్రోత్‌ ఆప్షన్‌కు మారాలనుకుంటున్నాను. ఇలా మారిపోవచ్చా ? ఇలా మారితే. ఇది. పాత మ్యూచువల్‌  ఫండ్‌యూనిట్ల విక్రయం.. కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల కొనుగోలుగా పరిగణిస్తారా ? – క్రిష్టోఫర్, సికింద్రాబాద్‌  
మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ట్యాక్స్‌ సేవింగ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో డివిడెండ్‌ ఆప్షన్‌ నుంచి గ్రోత్‌ ఆప్షన్‌కు మారడానికి.. ఆ ఫండ్‌ లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ముగిసేదాకా వీలుండదు. ట్యాక్స్‌ సేవింగ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు లాక్‌–ఇన్‌–పీరియడ్‌ సాధారణంగా మూడేళ్లు ఉంటుంది.

ఈ లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత మీకు స్వేచ్ఛ వస్తుంది. డివిడెండ్‌ ఆప్షన్‌ నుంచి గ్రోత్‌ ఆప్షన్‌కు మారవచ్చు. ఇలా మారితే.. పాత మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు విక్రయించి, కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల కొనుగోలుగా పరిగణిస్తారు. మీరు డివిడెండ్‌ నుంచి గ్రోత్‌ ఆప్షన్‌కు మారితే, మళ్లీ మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ వర్తిస్తుంది.   


- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫిబ్రవరిలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌దే హవా

రిలయన్స్‌ ‘రికార్డ్‌’ లాభం

జెట్‌కు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్‌!

ఆన్‌లైన్‌ రిటైల్‌... ఆకాశమే హద్దు!!

భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!

పడకేసిన ‘జెట్‌’

జెట్‌ రూట్లపై కన్నేసిన ఎయిర్‌ ఇండియా

ఆనంద్‌ మహీంద్ర ‘చెప్పు’ తో కొట్టారు..అదరహో

34 శాతం కుప్పకూలిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు

ముద్దు పెడితే...అద్భుతమైన సెల్ఫీ

లాభాల ప్రారంభం : అమ్మకాల జోరు

రిలయన్స్‌లో సౌదీ ఆరామ్‌కో పాగా!

హ్యుందాయ్‌ ‘వెన్యూ’ ఆవిష్కరణ 

భారత్‌లో యుహో  మొబైల్స్‌ ప్లాంట్‌ 

మైండ్‌ ట్రీ 200% స్పెషల్‌ డివిడెండ్‌

జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌!

జెట్‌ ఎయిర్‌వేస్‌ కథ ముగిసింది!

ఇది ఎయిర్‌లైన్‌ కర్మ

పీఎన్‌బీలో ఏటీఎం ఫ్రాడ్‌ ప్రకంపనలు

పీఎన్‌బీ స్కాం : కేంద్రం సంచలన నిర్ణయం

నేడు మార్కెట్లకు సెలవు

మూడు రోజుల్లో 68పైసలు డౌన్‌ 

జెట్‌పై బ్యాంకుల కసరత్తు 

నగలు జీవితంలో భాగమయ్యాయి 

త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్‌ 

విమానంలో కనెక్టివిటీ కోసం జియో దరఖాస్తు 

ఇక నుంచి కొత్త ఫామ్‌–16 

‘డీజిల్‌ కార్లు’ కొనసాగుతాయి: మారుతి 

కొత్త శిఖరాలకు స్టాక్‌ సూచీలు  

లాభం 38 శాతం జంప్‌... 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇన్‌స్టాగ్రామములో అడుగుపెట్టారు

జూన్‌లోపు నిర్ణయిస్తా

47 రోజుల సస్పెన్స్‌

వీకెండ్‌ పార్టీ ఛలో ఛలో

కామెడీ టు సీరియస్‌

తెలంగాణ తెస్తనంటే నవ్విండ్రు