ఎల్‌టీసీజీ రద్దు చేయాలి... 

27 Jan, 2020 05:02 IST|Sakshi

మ్యూచువల్‌ ఫండ్స్‌ డిమాండ్‌

ఎల్‌టీసీజీ ఎత్తివేత వంటి డిమాండ్లను కేంద్రం ఈసారైనా పరిగణనలోకి తీసుకోవాలని మ్యుచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ కోరుతోంది. వీటితో దేశీ ఎంఎఫ్‌ పరిశ్రమకు తోడ్పాటు లభించడంతో పాటు ఎకానమీని పటిష్టంగా చేసేందుకు, బాండ్‌ మార్కెట్‌ మరింతగా విస్తృతి చెందేందుకు, ఇన్‌ఫ్రా వృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రాతిపదికన నిధుల లభ్యత పెరగగలదని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల సమాఖ్య యాంఫీ పేర్కొంది. అలాగే, పెట్టుబడులను భౌతికరూపంలో పసిడి నుంచి గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు కూడా మళ్లించేలా చర్యలు తీసుకుంటే ద్రవ్య లోటు కూడా కట్టడి కాగలదని తెలిపింది.  
►తక్కువ వ్యయాలు, తక్కువ రిస్కులతో పాటు పన్ను మినహాయింపుల ప్రయోజనం ఉండే డెట్‌ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ (డీఎల్‌ఎస్‌ఎస్‌) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. 
►పన్ను విషయంలో యులిప్స్, ఈక్విటీ మ్యుచువల్‌ ఫండ్స్‌ను సరిసమానంగా పరిగణించాలి. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ)ని రద్దు చేయాలి. రిడెంప్షన్‌ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌పై విధిస్తున్న ఎస్‌టీటీని రద్దు చేయాలి. ఈక్విటీ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌ చెల్లించే డివిడెండ్లపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను తొలగించాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో అటూ, ఇటూ మారేటప్పుడు క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపునివ్వాలి. 
►మ్యూచువల్‌ ఫండ్స్‌ను స్పెసిఫైడ్‌ లాంగ్‌ టర్మ్‌ అసెట్స్‌గా పరిగణించాలి. ఐటీ చట్టం 1961లోని సెక్షన్‌ 54 ఈసీ కింద ఎల్‌టీసీజీ నుంచి మినహాయింపునివ్వాలి. 
►లిస్టెడ్‌ డెట్‌ సెక్యూరిటీల తరహాలోనే ఎల్‌టీసీజీ విధింపునకు సంబంధించి బంగారం, కమోడిటీ ఈటీఎఫ్‌లలో హోల్డింగ్‌ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించాలి. 
►డెట్‌ స్కీమ్‌లపై డీడీటీని తగ్గించాలి.

>
మరిన్ని వార్తలు