మ్యూచువల్ ఫండ్స్ దృష్టి...

14 Nov, 2016 02:40 IST|Sakshi
మ్యూచువల్ ఫండ్స్ దృష్టి...

న్యూఢిల్లీ: టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపుతో మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్ల ప్రయోజనాల రీత్యా మ్యూచువల్ ఫండ్‌‌స ఒక్కటయ్యారుు. టాటా గ్రూపు కంపెనీల్లో ఫండ్‌‌స పెట్టుబడులు రూ.20 వేల కోట్లకు పైగా ఉండడం, అదే సమయంలో డెట్, ఈక్విటీ ఫండ్‌‌సలో టాటా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలను అవి సునిశితంగా పరిశీలిస్తున్నారుు. ఓ ప్రముఖ ప్రైవేటు మ్యూచువల్ ఫండ్ చీఫ్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీ టాటా గ్రూపులో పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపారుు.

ఈ కమిటీలో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్లు సహా మొత్తం 19 మంది సభ్యులు ఉన్నారు. వారి పేర్లను బయటకు వెల్లడించడానికి ఆ వర్గాలు నిరాకరించారుు. టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించి, తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇరు వర్గాల మధ్య ఆరోపణలతో వివాదం నడుస్తున్న విషయం విదితమే. ఈ అంశాలన్నింటినీ గమనిస్తున్న ఫండ్‌‌స అవసరమైతే కలసికట్టుగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారుు. ఇప్పటికే రతన్ టాటా, సైరస్ మిస్త్రీ వర్గాలు తమ మద్దతు కోరినట్టు ఫండ్ మేనేజర్లు వెల్లడించారు.

 సంస్థాగత ఇన్వెస్టర్లలో ఆందోళన
మరోవైపు టాటా గ్రూపు కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం ఈ విషయంలో ఇప్పటికే సెబీని ఆశ్రరుుంచగా, తాజా పరిణామాలపై వారు సైతం ఓ కన్నేసి ఉంచారు. వాస్తవానికి టాటా గ్రూపులో వివాదంతో ఆ కంపెనీల షేర్ల విలువలు క్షీణించడం విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా