ఫండ్స్.. అమ్మకాల బాట

9 Mar, 2014 23:42 IST|Sakshi
ఫండ్స్.. అమ్మకాల బాట

 11 నెలల్లో రూ.10 వేల కోట్ల షేర్ల విక్రయం
 
 న్యూఢిల్లీ: ఓవైపు ఎఫ్‌ఐఐలు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులను కుమ్మరిస్తుంటే, మరోపక్క దేశీయ ఫండ్ సంస్థలు మాత్రం అమ్మకాలను చేపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో(ఏప్రిల్’13-జనవరి’14) మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ. 10,000 కోట్లకుపైగా విలువచేసే షేర్లను విక్రయించాయి. ఇందుకు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ(రిడెంప్షన్) పెరగడమే ప్రధాన కారణమని విశ్లేషకులు తెలిపారు. అయితే ఇదే కాలంలో రుణ సెక్యూరిటీల మార్కెట్లో అత్యంత భారీగా రూ. 4,43 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. కాగా, మే, ఆగస్ట్ నెలల్లో నికర పెట్టుబడిదారులుగా ఫండ్స్ నిలిచినప్పటికీ, మొత్తం 11 నెలలకాలంలో నికర అమ్మకందారులుగా నిలవడం ద్వారా రూ. 10,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 

మరిన్ని వార్తలు