స్కూలు ఎంపిక నుంచి పిల్లల ప్రోగ్రెస్ దాకా..

3 Dec, 2016 01:10 IST|Sakshi
స్కూలు ఎంపిక నుంచి పిల్లల ప్రోగ్రెస్ దాకా..

పాఠశాల సేవలన్నీ యాప్‌లో అందిస్తున్న ‘మై క్లాస్ బోర్డ్’
అడ్మిషన్స్ నుంచి ట్రాన్స్ పోర్ట్, కంటెంట్, లైబ్రరీ వరకూ
120 నగరాల్లో సేవలు; త్వరలో సింగపూర్, ఉక్రెయిన్‌లకు
‘స్టార్టప్ డైరీ’తో మై క్లాస్ బోర్డ్ ఫౌండర్ సీఈఓ అజయ్ శాఖమూరి 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యా సంవత్సరం మొదలవుతుందంటే చాలు!! పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలన్నదే తల్లిదండ్రుల ఆలోచన. ఇక ఉపాధ్యాయుల నియామకం, బోధన, పరీక్షలు, ఫలితాలు, ఫీజుల వంటివి యాజమాన్యాల ఆలోచన. అందుకే... ఈ ఇద్దరికి సంబంధించిన సేవలన్నిటినీ సమన్వయం చేస్తూ అందిస్తోంది ఎడ్యుటెక్ సంస్థ ‘మై క్లాస్ బోర్డ్’. ఒక్క ముక్కలో చెప్పాలంటే... మై క్లాస్ బోర్డ్ యాప్‌తో మొత్తం స్కూల్‌నే నడిపించొచ్చు.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మై క్లాస్ బోర్డ్.కామ్ గురించి సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ అజయ్ శాఖమూరి ఏం చెబుతారంటే.. ‘‘వాసవి కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాక.. రెండేళ్లు డెలారుుట్‌లో శాప్ డెవలపర్‌గా పనిచేశా. శాప్‌ను ఎక్కువగా పెద్ద సంస్థలకు ఈఆర్పీ కోసం వినియోగిస్తుంటారు. అప్పుడనిపించింది... దేశంలోని విద్యా వ్యవస్థలోనూ ఈఆర్పీని వినియోగించొచ్చు కదా అని! అలా 2009లో రూ.60 లక్షల పెట్టుబడితో మై క్లాస్ బోర్డ్.కామ్‌ను ప్రారంభించా.

ఇవీ ప్రధాన ఫీచర్లు...
మా యాప్ ద్వారా స్కూల్ చరిత్ర మొత్తం అందిస్తాం. దీన్ని చూసి పేరెంట్స్ తమ పిల్లల్ని చేర్చాలో వద్దో నిర్ణరుుంచుకోవచ్చు. దీన్లో ఫ్యాకల్టీ, యాక్టివిటీస్ వంటి వివరాలన్నీ ఉంటారుు. ఇక మా యాప్ ద్వారా స్కూలు ఫీజులు కూడా కట్టేయొచ్చు. గత విద్యా సంవత్సరంలో దాదాపు రూ.2,500 కోట్ల మేర ఫీజుల్ని మా యాప్ ద్వారా చెల్లించారు. క్లౌడ్ కంప్యూటింగ్ విధానంతో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు, హాజరు పట్టిక, క్లాస్, హోం వర్క్ అన్నింటినీ మా యాప్‌లో చూసుకోవచ్చు. ట్రాన్‌‌సపోర్ట్‌కు సంబంధించి...

పాఠశాలలో ఎన్ని బస్సులున్నారుు? ఏ బస్సు ఎంత దూరం ప్రయాణించింది? ప్రస్తుతం ఎక్కడుంది? స్కూలు బస్సు సరైన మార్గంలో వెళుతోందా? లేదా? వంటి వివరాలన్నీ అందిస్తాం. ఇంకా తల్లిదండ్రులు- టీచర్లు పరస్పరం మాట్లాడుకోవటానికి మెసెంజర్ ఉంటుంది. మర్నాడు క్లాసులో టీచర్ చెప్పబోయే పాఠం గురించి ముందుగానే విద్యార్థికి అందిస్తాం. ఆ తర్వాత ఆ పాఠానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను విద్యార్థులకు రిఫరెన్‌‌సగా పంపిస్తాం. వీటితో పాటు లైబ్రరీ, హెచ్‌ఆర్‌ఎం వంటి సేవలను కూడా మై క్లాస్ బోర్డ్ అందిస్తుంది.

120 నగరాలు.. 1,200 స్కూళ్లు..
ప్రస్తుతం దేశంలో 120 నగరాల్లోని 1,200 పాఠశాలలు మా సేవలను పొందుతున్నారుు. 8 లక్షల మంది విద్యార్థులున్నారు. హైదరాబాద్ నుంచి 30 శాతం పాఠశాలున్నారుు. మా సేవలను పాఠశాలలు తొలి నెల రోజులు ఉచితంగా పొందవచ్చు. ప్రభుత్వం అనుమతిస్తే గవర్నమెంట్ స్కూళ్లకు కూడా మై క్లాస్ బోర్డ్ సేవలను అందించాలనుకుంటున్నాం. మై క్లాస్ బోర్డ్ ప్రొడక్ట్ మొత్తం కావాలంటే నెలకు ఒక్కో విద్యార్థికి రూ.15. అలాకాకుండా విభాగాల వారీగా కావాలంటే విడివిడిగా ధరలుంటారుు.

రూ.25 కోట్ల నిధుల సమీకరణ..
సీటీఓ రవీంద్ర, ఆపరేషన్‌‌స హెడ్ శ్రీకాంత్ సారథ్యంలో ప్రస్తుతం మై క్లాస్ బోర్డ్‌లో 65 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతేడాది రూ.5.5 కోట్ల వ్యాపారం చేశాం. ఈ ఏడాది రెండితల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. గల్ఫ్, సింగపూర్, ఉక్రెరుున్ దేశాల్లోని పాఠశాలలు, వర్సిటీలకు మా సేవల్ని విస్తరించనున్నాం. ఇందుకోసం 25 కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఒకరిద్దరు ఇన్వెస్టర్లతో చర్చలు కూడా జరుగుతున్నారుు. 2017 ప్రథమార్థంలో డీల్‌ను క్లోజ్ చేస్తాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

మరిన్ని వార్తలు