నాల్కో షేర్ల బై బ్యాక్‌కు డెరైక్టర్ల బోర్డు ఆమోదం

26 May, 2016 02:10 IST|Sakshi

న్యూఢిల్లీ: అల్యూమినియం తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ నాల్కో షేర్ల బైబ్యాక్‌కు ఆ కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. 64.43 కోట్ల షేర్లకు (చెల్లించిన మూలధనంలో 25 శాతం వాటా) మించకుండా బై బ్యాక్ కోసం నాల్కో కంపెనీ రూ.2,835 కోట్లు వ్యయం చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ.44కు కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. ఇక  ఈబై బ్యాక్‌కు వాటాదారుల ఆమోదాన్ని ప్రత్యేక తీర్మానం ద్వారా పొందుతామని, దీనిని పోస్టల్ బ్యాలెట్ ద్వారా సమీకరిస్తామని వివరించింది.

ఈ కంపెనీలో 80.93 శాతం వాటా ఉన్న ప్రభుత్వం గతంలో 25 శాతం వాటా విక్రయం ద్వారా రూ.3,250 కోట్లు సమీకరించాలని యోచించింది. బై బ్యాక్ ప్రకటన నేపథ్యంలో నాల్కో షేర్ స్వల్పంగా 1.65 శాతం లాభపడి రూ. 43 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు