నందన్‌ నీలేకని 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌

4 Jul, 2017 00:48 IST|Sakshi
నందన్‌ నీలేకని 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌

న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థలకు చేయూతనిచ్చే దిశగా 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ఏర్పాటుకు..ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, వెంచర్‌ క్యాపిటలిస్టు సంజీవ్‌ అగర్వాల్‌ చేతులు కలిపారు. ‘ది ఫండమెంటమ్‌ పార్ట్‌నర్‌షిప్‌’ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ ఫండ్‌.. ముఖ్యంగా కన్జూమర్‌ టెక్నాలజీ  కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనుంది.

అవకాశాలను బట్టి  200 మి.డాలర్ల దాకా పెంచనున్నట్లు పేర్కొంది. వ్యాపారాన్ని తదుపరి స్థాయికి పెంచుకునేందుకు వనరులు అన్వేషిస్తున్న సంస్థల్లో 10–25 మి. డాలర్ల శ్రేణిలో ఇన్వెస్ట్‌ చేయనుంది.

మరిన్ని వార్తలు