‘నానో’కు.. టాటా

7 Jan, 2020 08:46 IST|Sakshi

2019లో ఉత్పత్తి జీరో...: కంపెనీ  

న్యూఢిల్లీ: లక్ష రూపాయలకే అంటూ మార్కెట్లోకి వచ్చిన రతన్‌ టాటా కలల కారు... ప్రజల కారు.. ‘నానో’ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఒక్క నానో కూడా ఉత్పత్తి చేయలేదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘2019లో జీరో ప్రొడక్షన్‌’ అంటూ.. నానో ఉత్పత్తిపై ఎక్సే్ఛంజీలకు కంపెనీ సోమవారం సమాచారమిచ్చింది. కాకపోతే అంతకు ముందటేడాది ఉత్పత్తి చేసిన ఒక కారును 2019 ఫిబ్రవరిలో విక్రయించామని మాత్రం వెల్లడించింది. అయితే, భవిష్యత్తులో కంపెనీ మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయంటూ ప్రజల్లో ఉన్న ఆసక్తిని సంస్థ యాజమాన్యం కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌–6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో చౌక కారు ఉత్పత్తి దాదాపుగా అసాధ్యమేనని ఆటో పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు