యస్...మూర్తి ఫిలాసఫీనే కరెక్ట్

4 Apr, 2017 17:31 IST|Sakshi
యస్...మూర్తి ఫిలాసఫీనే కరెక్ట్
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో ముదురుతున్న వేతన ప్యాకేజీ రగడపై అమెరికన్ నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్ఆర్ నారాయణమూర్తి ''కరుణామయ పెట్టుబడిదారీ'' విధానానికి మద్దతు తెలుపుతూ అమెరికాకు చెందిన మేనేజ్ మెంట్ నిపుణులు అభిప్రాయాలు వెల్లబుచ్చారు. పెట్టుబడిదారీ విధానాన్ని విశ్వసిస్తానని, కానీ దురాశ పోకడను కాదని కోక్సి డిస్టింగ్యూసెట్ ప్రొఫెసర్ విజయ్ గోవిందరాజన్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ల దురాశను తప్పనిసరిగా తగ్గించాలని అభిప్రాయపడ్డారు. ఆర్థిక రాబడులు పెంచుకునే ఉద్దేశ్యం మాత్రమే కంపెనీకి ఉండకూడదు, మంచి చేసే ఉద్దేశ్యంతో కంపెనీ పనిచేయాలని సూచించారు.
 
ఫార్చ్యూన్ 150 స్టీల్ కంపెనీలో ఒకటైన నోకుర్, అత్యంత లాభాదాయక స్టీల్ కంపెనీ అని, అయితే ఆ కంపెనీ సీఈవో పరిహారాలు, వర్కర్ల కంటే 500 టైమ్స్ ఎక్కువగా ఉండవని గోవిందరాజన్ చెప్పారు. ఇలా మిగతా కంపెనీలు కూడా కరుణామయ పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. చాలా పెద్ద కంపెనీల సీఈవోల్లో ప్రతిభ కరవతుందని, దీనికి గల కారణం అహంకారం, దురాశేనని, అంతకుమించి ఏదీ లేదని అమెరికన్ రచయిత, వ్యాపారవేత్త సేథ్ గోడిన్ చెప్పారు. అమెరికా పద్ధతి మాదిరిగా కార్పొరేటివ్ ఎగ్జిక్యూటివ్ లకు ఎక్కువ వేతనాలు చెల్లించడం భారత్ కు అంత మంచిది కాదని మరో నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. దీర్ఘకాల కంపెనీ ప్రదర్శనతో వేతనాలను ముడిపెడితే, అప్పుడు పెద్దపెద్ద విజయాలకు ఎక్కువ మొత్తంలో వేతనాలు పెంపు బాగుంటుందని, కానీ స్వల్పకాల విజయాలకే పెద్ద పెద్ద బోనస్ లు ప్రకటించడం సరియైన పద్ధతి కాదని నిపుణులు పేర్కొంటున్నారు.   
 
>
మరిన్ని వార్తలు