రుణభారం తగ్గించుకోడానికి కసరత్తు: కంట్రీక్లబ్‌

16 Nov, 2018 01:19 IST|Sakshi

ముంబై: రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే క్రమంలో నిధుల సమీకరణకు కంట్రీ క్లబ్‌ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట్, కర్ణాటకలోని సర్జాపూర్‌ ప్రాపర్టీలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంట్రీ క్లబ్‌ హాస్పిటాలిటీ అండ్‌ హాలిడేస్‌ (సీసీహెచ్‌హెచ్‌ఎల్‌) చైర్మన్‌ వై.రాజీవ్‌ రెడ్డి వెల్లడించారు.

వీటిని అభివృద్ధి చేయడంతో 5 లక్షల చదరపుటడుగుల డెవలప్‌మెంట్‌ ఏరియా అందుబాటులోకి వస్తుందని, కంపెనీకి రూ.140 కోట్ల దాకా లభించగలవని ఆయన చెప్పారు.ప్రస్తుతం దేశీయంగా తమ రుణభారం రూ. 275 కోట్లని, రూ.1,500 కోట్ల మేర ఆస్తులున్నాయని చెప్పారాయన. 

మరిన్ని వార్తలు