ఎన్‌బీసీసీ- ఎస్‌హెచ్‌ కేల్కర్‌- పిపావవ్‌ అప్‌

7 Jul, 2020 14:08 IST|Sakshi

రుణ భారం తగ్గింపుతో కేల్కర్‌కు జోష్‌

విదేశీ సంస్థ వాటా కొనుగోలుతో పిపావవ్‌ జోరు

క్యూ4 ఫలితాల నిరాశ- అయినా ఎన్‌బీసీసీ ప్లస్‌

మార్కెట్లు స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. అయితే విభిన్న వార్తల నేపథ్యంలో ఎస్‌హెచ్‌ కేల్కర్‌, గుజరాత్‌ పిపావవ్‌ పోర్ట్‌, ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ మూడు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

గుజరాత్‌ పిపావవ్‌ పోర్ట్‌
విదేశీ సంస్థ జేపీ మోర్గాన్‌ ఫండ్స్‌ కంపెనీలో వాటా కొనుగోలు చేసిన వార్తలతో పోర్ట్‌ హ్యాండ్లింగ్‌, మెరైన్‌ సర్వీసుల కంపెనీ గుజరాత్‌ పిపావవ్‌ పోర్ట్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 8 శాతం జంప్‌ చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 90 వరకూ ఎగసింది. బ్లాక్‌ డీల్‌ ద్వారా గుజరాత్‌ పిపావవ్‌ పోర్ట్‌లో 0.63 శాతం వాటాను జేపీ మోర్గాన్‌ ఫండ్స్‌ కొనుగోలు చేసింది. 30.34 లక్షల షేర్ల కొనుగోలుకి రూ. 23.6 కోట్లను వెచ్చించింది. 

ఎస్‌హెచ్‌ కేల్కర్‌
వివిధ పరిమళ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఎస్‌హెచ్ కేల్కర్‌ తాజాగా జూన్‌ చివరికల్లా రుణ భారాన్ని రూ. 255 కోట్లకు పరిమితం చేసుకున్నట్లు తెలియజేసింది. అంతకుముందు 2020 మార్చికల్లా రుణ భారం రూ. 299 కోట్లకు తగ్గించుకున్నట్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్‌హెచ్‌ కేల్కర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 7శాతం జంప్‌చేసి రూ. 71 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 73 వరకూ ఎగసింది.

ఎన్‌బీసీసీ ఇండియా
గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎన్‌బీసీసీ ఇండియా షేరు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌బీసీసీ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 27 వద్ద ట్రేడవుతోంది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో ఎన్‌బీసీసీ ఇండియా నికర లాభం  68 శాతం క్షీణించింది. రూ. 48.5 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 33 శాతం తక్కువగా రూ. 1570 కోట్లకు చేరాయి.

మరిన్ని వార్తలు