ఎమార్‌ డీమెర్జర్‌కు ఎన్‌సీఎల్‌టీ ఓకే

10 Jan, 2018 01:10 IST|Sakshi

ఇక రెండు సంస్థలుగా ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ కంపెనీ

ఎమార్‌ ప్రాపర్టీస్‌; ఎమార్‌ డెవలప్‌మెంట్‌గా

న్యూఢిల్లీ: ఎమార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ కంపెనీ డీమెర్జర్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. దీంతో ఎమార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ జాయింట్‌ వెంచర్‌ ఇక ఎమార్‌ ప్రాపర్టీస్, ఎమార్‌ డెవలప్‌మెంట్‌లుగా విడిపోతుంది. ఈ జేవీకి  చెందిన అన్ని రుణాలు, హక్కులు, అధికారాలు ఎంజీఎఫ్‌ డెవలప్‌మెంట్‌కు బదిలీ అవుతాయని ట్రిబ్యునల్‌ పేర్కొంది.

ఈ జేవీకి సంబంధించి విచారణలో ఉన్న అన్ని అంశాల బాధ్యత కూడా ఎంజీఎఫ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీకే ఉంటుంది. ఎమార్‌ ఎంజీఎఫ్‌  ల్యాండ్‌కు చెందిన ప్రతి 416 షేర్లకు ఎంజీఎఫ్‌ డెవలప్‌మెంట్స్‌ కంపెనీ ఒక్కోటి రూ.10 విలువైన 9 ఈక్విటీ షేర్లను జారీ చేస్తుందని పేర్కొంది. ఎమార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌కు చెందిన రూ.713 కోట్ల డిబెంచర్లతో సహా ప్రస్తుత, భవిష్యత్తు రుణాలు కూడా ఎమ్‌జీఎఫ్‌ డెవలప్‌మెంట్‌కు బదిలీ అవుతాయని ఎన్‌సీఎల్‌టీ తెలిపింది.

మరిన్ని వార్తలు