సిమెంట్‌ కంపెనీలకు షాక్‌..!

26 Jul, 2018 01:05 IST|Sakshi

పెనాల్టీపై ఎన్‌సీఎల్‌టీలో చుక్కెదురు

3% పతనమైన సిమెంట్‌ రంగ షేర్లు

న్యూఢిల్లీ: నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌ఏటీ) సిమెంట్‌ కంపెనీలకు చుక్కెదురయ్యింది. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విధించిన పెనాల్టీని సవాలు చేస్తూ 11  సిమెంట్‌ సంస్థలు పెట్టుకున్న అభ్యర్ధనను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. ఈ తీర్పు వెలువడిన తరువాత స్టాక్‌ మార్కెట్‌లో సిమెంట్‌ రంగ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇంట్రాడేలో 14 శాతం వరకు నష్టపోయాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి 3 శాతం నష్టాన్ని నమోదుచేశాయి.

ఇండియా సిమెంట్స్‌ 3.29 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 2.39 శాతం, అంబుజా సిమెంట్స్‌ 1.50 శాతం, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ 1.31 శాతం, జెకె లక్ష్మీ సిమెంట్‌ 1.26 శాతం, ఏసీసీ 0.28 శాతం నష్టపోయాయి. సిమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌(సీఎమ్‌ఏ), అల్ట్రాటెక్, ఏసీసీ, రామ్కో, జేకే సిమెంట్, అంబుజా సహా 11 సిమెంట్‌ సంస్థలు కార్టెల్‌గా ఏర్పడి ధరలను నియంత్రించాయని పేర్కొంటూ... 2016 అగస్టులో సీసీఐ ఈ సంస్థలపై రూ.6,700 కోట్ల పెనాల్టీని విధించింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు