ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐ దర్యాప్తును ఆదేశించిన ఎన్‌సీఎల్‌ఏటీ

5 Mar, 2020 05:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ను నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సీసీఐ తన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) చేత ఈ దర్యాప్తును జరిపించాలని బుధవారం సూచించింది. జస్టిస్‌ ఎస్‌.జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. సీసీఐ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి, తాజా దర్యాప్తునకు ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అన్‌ఫెయిర్‌ ప్రాక్టీసెస్‌కు పాల్పడిందని అఖిల భారత ఆన్‌లైన్‌ వెండార్స్‌ అసోసియేషన్‌ (ఏఐఓవీఏ) 2018 నవంబర్‌లో సీసీఐను ఆశ్రయించిన విషయం తెలిసిందే కాగా.. ఈ వాదనలో నిజం లేదని తేల్చింది. అయితే, ఈ విషయమై కేసు ఎన్‌సీఎల్‌ఏటీ వరకు వెళ్లగా.. డీజీ చేత పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ద్వారా చిన్న వర్తకులు నేరుగా వినియోగదారులకు వస్తువులను విక్రయించాల్సి ఉండగా.. ఇందుకు భిన్నంగా క్లౌడ్‌టైల్, డబ్ల్యూఎస్‌ రిటైల్‌ వంటి పెద్ద వర్తకులు, సప్లయర్లతో కుమ్మౖMð్క విక్రయాలు నిర్వహించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ అవకాశం కల్పించిందని ఏఐఓవీఏ ఆరోపిస్తోంది.

‘కరోనా’పై సెబీ అప్రమత్తం
ముంబై: క్యాపిటల్‌ మార్కెట్లపై కరోనా వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయమై సెబీ అంతర్గతంగా మదింపు చేస్తోంది. కరోనా వైరస్‌ గురించి, అది మార్కెట్‌పై చూపగల ప్రభావం గురించి సెబీకి తగిన అవగాహన ఉందని సెబీ హోల్‌–టైమ్‌ మెంబర్‌ ఎస్‌.కె. మోహంతి పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. ఆసోచామ్‌ ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్‌)లకు సంబంధించి డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు