టాటాకు మరోసారి ఎదురు దెబ్బ

6 Jan, 2020 14:18 IST|Sakshi

టాటాకు షాక్‌..ఆర్‌వోసీ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ: టాటాకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. టాటాసన్స్‌ నుంచి ఉద్వాసన పలికిన సైరస్‌ మిస్త్రీ వివాదంలో నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తన తీర్పును సమీక్షించేందుకు నిరాకరించింది. గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ నియామక తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన అభ్యర్తనను ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కరించింది. జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్‌ ఆర్‌వోసీ (రిజిష్టర్‌ ఆఫ్ కంపెనీస్)పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. గతంలో వెల్లడించిన తీర్పును సమీక్షించేది లేదని ఎన్‌సీఎల్‌ఏటీ  తేల్చి చెప్పింది.

ఎన్‌సీఎల్‌ఏటీ వెల్లడించిన తీర్పును సమీక్షించాలని ఆర్‌వోసీ  పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. టాటా చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ నియామకం చెల్లదని ఎన్‌సీఎల్ఏటీ డిసెంబర్ 18, 2019న ఆదేశించింది. మరోవైపు సైరస్‌ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదానికి సంబంధించిన వాదనలు త్వరలోనే సుప్రీం కోర్టులో జరగనున్నాయి.
చదవండి: టాటా గ్రూప్‌ చైర్మన్‌ హోదా అక్కర్లేదు: సైరస్‌ మిస్త్రీ 

మరిన్ని వార్తలు