శ్రేయి చేతికి డెక్కన్‌ క్రానికల్‌

4 Jun, 2019 07:57 IST|Sakshi

ఆ సంస్థ ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) విషయంలో శ్రేయి మల్టిపుల్‌ అస్సెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌కు చెందిన విజన్‌ ఇండియా ఫండ్‌ సమర్పించిన రూ.1,000 కోట్ల పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. శ్రేయి పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ(సీవోసీ) గతంలోనే 81.39% మెజారిటీతో ఆమోదం తెలియజేయగా, దీనికి తాజాగా ఎన్‌సీఎల్‌టీ కూడా ఓకే చెప్పింది. డీసీహెచ్‌ఎల్‌ నుంచి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.8,000 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నాయి. వీటిల్లో దాదాపు రూ.400 కోట్ల వరకు ఎక్స్‌పోజర్‌ కలిగిన కెనరా బ్యాంకు పరిష్కారం కోరుతూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం తెలిసిందే. పరిష్కార ప్రణాళికకు చట్ట ప్రకారం అవసరమైన అన్ని రకాల అనుమతులను ఏడాదిలోగా పొందాల్సి ఉంటుందని ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ తన ఆదేశాల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు