జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా

21 Dec, 2019 05:59 IST|Sakshi

పరిష్కార గడువు పెంపు

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌ వేస్‌ రుణ దాతల కమిటీ (సీవోసీ) దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ను కోరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు కార్పొరేట్‌ దివాలా పరిష్కార గడువు (180 రోజులు) ఈ నెల 16న ముగియగా, ఈ గడువును మరో 90 రోజులు పాటు పొడిగిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్‌ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు