అటెన్షన్‌ ఐడియా యూజర్స్‌..

13 Jan, 2018 11:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  టెలికాం రంగంలో వొడాఫోన్ -ఐడియా మెగా  విలీనానికి మరో కీలక ముందడుగు పడింది.  తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపిందని ఐడియా సెల్యులార్ శుక్రవారం తెలిపింది. ఇక ఫైనల్‌గా  రెండు కంపెనీలకు టెలికామ్ విభాగం నుంచి తుది ఆమోదం  రావాల్సి ఉంది.  దీంతో  ఈ డీల్‌ అమల్లోకి వస్తుంది.

టెలికాం రంగలోకి దూసుకొచ్చిన రిలయన్స్‌జియో పోటీని తట్టుకునే వ్యూహంలో భాగంగా ఈ మెగాడీల్‌కు పునాది పడింది. గత ఏడాది మార్చిలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూపునకు చెందిన భారతీయ విభాగం..ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్‌తో విలీనం కాబోతున్నట్టు వెల్లడించాయి. 23 బిలియన్ డాలర్ల విలువైన, 35 శాతం మార్కెట్ వాటాతో ఈ అతిపెద్ద   విలీనానికి   ఇరు సంస్థలు అంగీకరించాయి.  అటు అక్టోబర్‌లో ఐడియా వాటాదారులు  వొడాఫోన్‌తో  విలీనానికి ఆమోదం తెలిపారు.  ఇప్పటికే  మార్కెట్‌ రెగ్యులేటరీ  సెబీ,  కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ (డాట్‌)  ఇచ్చే తుది ఆమెదంతో ఏడాది జూన్‌ నాటికి ఈ పక్రియ పూర్తి చేయాలని రెండు కంపెనీలు యోచిస్తున్నాయి.

ఈ ఉమ్మడి సంస్థలో బ్రిటిష్ కంపెనీ 45.1 శాతం వాటా,  ఐడియా పేరెంట్‌  సం‍స్థ ఆదిత్య బిర్లా గ్రూపు 26 శాతం వాటా కలిగి ఉంటుంది. మిగిలిన 28.9 శాతం ఇతర వాటాదారుల సొంతం. ప్రస్తుతం భారతదేశంలో నంబర్ 2 , 3 స్థానాల్లో కొనసాగుతున్న వొడాఫోన్ ఇండియా, ఐడియాల జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఆవిష్కారంతో  ప్రపంచ రెండవ అతిపెద్ద టెలికాం భారతి ఎయిర్‌టెల్‌కు గట్టిపోటీగా నిలుస్తుందని అంచనా.
 

మరిన్ని వార్తలు