ఇండియన్ బ్యాంక్ లాభం రూ. 307 కోట్లు

3 Aug, 2016 01:23 IST|Sakshi
ఇండియన్ బ్యాంక్ లాభం రూ. 307 కోట్లు

ఏడాది గరిష్ట స్థాయికి షేర్ ధర

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 43 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.215 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.307 కోట్లకు పెరిగిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,495 కోట్ల నుంచి రూ.4,513 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ మహేశ్ కుమార్ జైన్ చెప్పారు. క్యాపిటల్ అడెక్వసీ రేషియో, రుణ నాణ్యత అంశాల్లో మంచి పనితీరును కనబరిచామన్నారు. 

నికర మొండి బకాయిలు 2.62 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగాయని, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.408 కోట్ల నుంచి రూ.416 కోట్లకు పెంచామని వివరించారు. నికర వడ్డీ  మార్జిన్ 2.36 శాతం నుంచి 2.47 శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి క్యాపిటల్ అడెక్వసీ రేషియో 13.98 శాతంగా ఉందని తెలియజేశారు.  కాగా, రూ.1,000 కోట్ల వరకూ నిధులు  సమీకరించనున్నామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మంగళవారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెఇపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్ షేర్ 20% లాభపడి  ఏడాది గరిష్ట స్థాయి, రూ.186 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు